Vivo తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Vivo Y3s 2021 ను ఇండియాలో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ వివో స్మార్ట్ ఫోన్ ను కేవలం బడ్జెట్ ధరలో అందించింది. ఈ ఫోన్ ను బిగ్ డిస్ప్లే, బిగ్ బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) వంటి మంచి ఫీచర్లతో కేవలం 10 వేల కంటే తక్కువ ధరలో ప్రకటించింది.
Vivo Y3s 2021స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.9, 990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డిస్కౌంట్ అఫర్ తో రూ.9,490 రూపాయల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది.
వివో వై 3ఎస్ 2021 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.51 అంగుళాల HD డ్రాప్ నోచ్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో P35 ఆక్టా కోర్ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ మంచి డిజైన్ మరియు పెర్ల్ వైట్, స్టార్రి బ్లూ మరియు మింట్ గ్రీన్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
కెమెరా విషయానికి వస్తే, వివో వై 3ఎస్ 2021 వెనుకసింగల్ కెమెరా సెటప్ మాత్రమే వుంటుంది మరియు ఇందులో, 13MP మైన్ కెమెరా అందుతుంది. అయితే, దూరం నుంచి చూస్తే ఇది డ్యూయల్ కెమెరాతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 11 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) తో వస్తుంది. ఈ ఫోన్ ను పెద్ద 5000 mAh బ్యాటరీతో అందించింది.