vivo Y28 5G launch: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన వివో.!

HIGHLIGHTS

మార్కెట్ లో మరొక కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది వివో

వివో యొక్క కొత్త బడ్జెట్ 5జి ఫోన్ వివో వై28 5జి

ఈ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్ ను కూడ అందించింది వివో

vivo Y28 5G launch: కొత్త బడ్జెట్ 5జి ఫోన్ లాంచ్ చేసిన వివో.!

vivo Y28 5G launch: మార్కెట్ లో మరొక కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది వివో. ఇప్పటికే అన్ని సెగ్మెంట్ లలో ఆకట్టుకునే ఫీచర్లలతో స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన వివో బ్రాండ్, ఇప్పుడు బడ్జెట్ ధరలో కూడా పాగా వేసింది. వివో యొక్క కొత్త బడ్జెట్ 5జి ఫోన్ వివో వై28 5జి ని ఈరోజు ఇండియన్ మార్కెట్ లో వివో లాంచ్ చేసింది. వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ఎటువంటి ఫీచర్లను కలిగి వుంది మరియు దీని ధర ఎంత అనే అన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo Y28 5G launch

ఈరోజు వివో తన సిరీస్ నుండి వై28 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను రూ. 13,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ 4GB + 128GB ధర. ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 15,499 రూపాయల ధరతో, 8GB + 128GB వేరియంట్ ను రూ. 16,999 రూపాయల ధరతో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ పైన బ్యాంక్ ఆఫర్ ను కూడ అందించింది వివో. ఈ ఫోన్ ను HDFC & ICICI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ మరియు EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్ వివో ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ ల నుండి లభిస్తుంది.

Also Read: Upcoming Mobile: 7 వేల లోపలే అదిరిపోయే ఫోన్ తెస్తున్న ఇన్ఫినిక్స్.!

వివో వై28 5జి ప్రత్యేకతలు

వివో వై28 5జి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 6020 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. దినికి జతగా 8GB వరకూ ర్యామ్ మరియు 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఎక్స్ టెండెడ్ RAM 3.0 ఫీచర్ వున్నాయి. ఈ ఫోన్ ను 5000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో తీసుకు వచ్చింది.

vivo Y28 5G features

కెమేరా పరంగా వివో వై28 5జి స్మార్ట్ ఫోన్ వెనుకడ్యూయల్ రియర్ కేమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ సెటప్ లో 50MP మెయిన్ + 2MP బొకే కెమేరా ఉన్నాయి. అలాగే, వివో వై28 5జి ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ ను 6.56 ఇంచ్ LCD స్క్రీన్ ను HD+ రిజల్యూషన్ తో వివో లాంచ్ చేసింది. వివో వై28 స్మార్ట్ ఫోన్ చాలా సన్నగా మరియు తేలికగా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo