Vivo X90 Series: ప్రీమియం ఫీచర్లతో వస్తున్న వివో స్మార్ట్ ఫోన్స్.!

HIGHLIGHTS

Vivo X90 Series ను విడుదల చెయ్యడానికి రెడీ అయ్యింది

టాప్ కెమేరా సెటప్ తో అందించబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్ధం అవుతోంది

Vivo X90 Series యొక్క టీజ్డ్ ఫీచర్లు మరియు అంచనా స్పెక్స్

Vivo X90 Series: ప్రీమియం ఫీచర్లతో వస్తున్న వివో స్మార్ట్ ఫోన్స్.!

వివో ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ సిరీస్ Vivo X90 Series ను విడుదల చెయ్యడానికి రెడీ అయ్యింది. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్  ఫోన్ సిరీస్ ను ప్రీమియం ఫీచర్లు మరియు టాప్ కెమేరా సెటప్ తో అందించబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్ధం అవుతోంది. వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ యొక్క కొన్ని కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను టీజర్ ద్వారా అందించింది. Vivo X90 Series యొక్క టీజ్డ్ ఫీచర్లు మరియు అంచనా స్పెక్స్ ఏమిటో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo X90 Series: టీజ్డ్ స్పెక్స్ 

ఫిబ్రవరి 26న ఇండియాలో లాంచ్ కానున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ ద్వారా Vivo X90 Series స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని వివరాలను గురించి టీజింగ్ చేస్తోంది. 

Vivo X90 Series స్మార్ట్ ఫోన్ లను ఎప్పటిలాగానే ZEISS అనుబంధంతో తీసుకువస్తునట్లు తెలిపింది. ఇందులో కెమేరా సెటప్ ను  Zeiss Variso – Tessar అనుసంధాన ఫీచర్ తో ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ చూపిస్తోంది.

ఈ కెమేరా సెటప్ లో Zeiss 1 ఇంచ్ మైన్ కెమేరా ఉన్నట్లు తెలిపింది. ఇది మరింత వెలుగును స్వీకరించడం ద్వారా ప్రతీ నైట్ షాట్ ను                  మరింత క్లారిటీ, ప్యూరిటీ మరియు అద్భుతంగా చేయగలదని వివో ఈ ఫోన్ గురించి పొగుడుతోంది. అంతేకాదు, ఈ కెమేరాని 1 గ్లాస్ మరియు 7 ప్లాస్టిక్ లెన్స్ లతో కూడిన 8P తో ఉన్నట్లు, ఇది CIPA Level 4 OIS సపోర్ట్ ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా తెలిపింది. 

టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ 30fps వద్ద నైట్ 4K వీడియో లను క్యాప్చర్ చేసే సత్తా కలిగి ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే, ఇమేజ్ లో సముద్రం పైన ఉన్న ఫుల్ మూన్ ని 4K / 30fps వీడియో రికార్డ్ లో చూపించింది. ఈ ఫోన్ లో వెనుక టోటల్ 4 కెమేరాలు ఉన్నాయి. 

Vivo X90 Series స్మార్ట్ ఫోన్ లలో కర్వ్డ్ డిస్ప్లే ఉన్నట్లు కూడా ఈ టీజర్ ఇమేజ్ చూపించింది. అయితే, Vivo X90 Series లాంచ్ కోసం ఇంకా రెండు రోజుల సమయం ఉన్నది కాబట్టి మరిన్ని వివరాలను టీజర్ ద్వారా వెల్లడించవచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo