Vivo X9 Blue స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబడింది

Vivo X9 Blue  స్మార్ట్  ఫోన్ లాంచ్  చేయబడింది
HIGHLIGHTS

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ చైనా లో సేల్స్ కి అందుబాటులో కలదు

Vivo X9 Blue  స్మార్ట్  ఫోన్ లాంచ్  చేయబడింది  ప్రస్తుతం ఈ స్మార్ట్  ఫోన్  చైనా  లో  సేల్స్  కి అందుబాటులో కలదు .  ఇది బ్లూ  కలర్  నే  కాక  గ్లోడ్ ,రోజ్  గ్లోడ్ అండ్   స్టార్  గ్రే  అండ్   మెట్  బ్లాక్   కలర్స్  లో అందుబాటులో  కలదు.   ఈ బ్లూ  కలర్  వేరియంట్  ధర  2598 yuan ( అంటే  సుమారు Rs 24,585)  వరకు ఉంటుందని సమాచారం . 

Vivo X9 స్మార్ట్ ఫోన్ ని చైనా  లో నవంబర్  న  2016  లో ప్రవేశపెట్టారు . ఈ ఫోన్ తో పాటుగా  Vivo X9 Plus  ని కూడా లాంచ్ చేశారు .  దీనిలో అత్యంత  ప్రత్యేక లక్షణమ్ దీని  యొక్క డ్యూయల్  ఫ్రంట్ కెమెరా .  ఒకటి  20  ఎంపీ ది  రెండవది  8 ఎంపీ 

Vivo X9  లో మెటల్ యూని బాడీ  ఇవ్వబడింది .  మరియు దీనిలో  5.5- ఇంచెస్ ఫుల్  HD  సూపర్  AMOLED  డిస్ప్లే  కలదు .  దీని యొక్క రెసొల్యూషన్   1080×1920పిక్సల్స్ .దీనిలో  2GHz  ఆక్టా  కోర్  స్నాప్  డ్రాగన్  625  ప్రోసెసర్ ఇవ్వబడింది .

దీనిలో  అడ్రినో  506 GPU  తో పాటుగా  4GB RAM  అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్   6.0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది .దీనిలో ఒక ఫింగర్  ప్రింట్  స్కానర్  కలదు,  మరియు  3050mAh  బ్యాటరీ .  ఇది ఒక డ్యూయల్ సిమ్  స్మార్ట్ ఫోన్  4G VoLTE .  దీనిలో  వైఫై   , బ్లూటూత్  మరియు  GPS  కూడా కలవు . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo