VIVO X80 Series: భారీ ఫీచర్లతో వచ్చిన వివో లేటెస్ట్ ఫోన్లు..!!

Updated on 18-May-2022
HIGHLIGHTS

వివో సంస్థ ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది

వివో ఎక్స్80 మరియు ఎక్స్80 ప్రో లను ప్రకటించింది

Vivo X80 Pro మరియు X80 5G స్మార్ట్ ఫోన్లు Pre-Book కోసం కూడా అందుబటులో ఉంచింది

వివో సంస్థ ఇండియన్ మార్కెట్లో భారీ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అదే, వివో యొక్క X80 సిరీస్ స్మార్ట్ ఫోన్లు. ఈ సిరీస్ నుండి వివో ఎక్స్80 మరియు ఎక్స్80 ప్రో లను ప్రకటించింది. ఈ రెండు ఫోన్లను కూడా వేగవంతమైన ప్రీమియం ప్రాసెసర్, భారీ కెమెరా సెటప్ మరియు మరొన్ని ప్రత్యేకతలతో తీసుకొచ్చింది. ఈ Vivo X80 సిరీస్ నుండి వచ్చిన Vivo X80 Pro మరియు Vivo X80 5G స్మార్ట్ ఫోన్లు Pre-Book కోసం కూడా అందుబటులో ఉంచింది. మరి ఈ లేటెస్ట్ వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల పూర్తి వివరాల పైన ఒక లుక్ వేద్దామా.

Vivo X80 5G

Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 9000 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ కూడా తగినట్లుగా వుంటుంది. వివో X80 ప్రో 8GB/12GB  ర్యామ్ తో పాటుగా 128GB/256GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేనిం FHD రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.   

కెమెరా పరంగా వివో X80 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP SonyIMX866 మైన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 12MP (2x, 20x superzoom) కెమెరాతో పాటుగా ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ మరియు V1+ చిప్ తో అందించింది.  ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించ గలదని వివో వెల్లడించింది.         

Vivo X80 Pro

ఇక X80 సిరీస్ లో హై ఎండ్ వేరియంట్ Vivo X80 Pro స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఇది క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 Gen 1 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. వివో X80 ప్రో 12GB ప్రధాన ర్యామ్ తో పాటుగా 256GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితంగా OriginOS Ocean సాఫ్ట్ వేర్ పైన నడుస్తుంది. ఈ ఫోన్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ LTPO2  AMOLED డిస్ప్లే ని QHD+ రిజల్యూషన్ తో కలిగింవుంది.

కెమెరా పరంగా వివో X80 ప్రో వెనుక క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP మైన్ కెమెరాని లేటెస్ట్ Samsung GNV OIS సెన్సార్ ని, 48MP  అల్ట్రా వైడ్ సెకండరీ సెన్సార్, 12MP గింబాల్ మరియు 8MP (60x జూమ్) పెరిస్కోప్ సెన్సార్ ని కలిగి వుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ మరియు V1+ చిప్  తో అందించింది.  ఈ ఫోన్ అద్భుతమైన ప్రొఫెషనల్ ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించ గలదని వివో చెబుతోంది.  , IP68 ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ మరియు 80W వైర్డు ఛార్జింగ్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 4700mAh బ్యాటరీని కూడా కలిగి వుంది.

Vivo X80 & X80 Pro: ధర

ఈ సిరీస్ నుండి Vivo X80 రెండు వేరియంట్ లలో లభిస్తుండగా, X80 Pro సింగల్ వేరియంట్ లో లభిస్తుంది. వీటి ధరలు క్రింద చూడవచ్చు.

Vivo X80 5G (8GB+128GB) ధర : రూ.54,999   

Vivo X80 5G (12GB+256GB) ధర : రూ.59,999

ఇక X80 Pro ధర గురించి చూస్తే,

Vivo X80 5G (12GB+256GB) ధర : రూ.79,999 

ఈ స్మార్ట్ ఫోన్ల పైన 7,000 రూపాయల వరకూ HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్, Bajaj No Cost EMI అఫర్ లను కూడా అందించింది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :