వివో ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ప్రకటించడానికి సిద్ధమవుతోంది. అదే, Vivo X80 Series మరియు ఈ ఫోన్ గురించి కంపెనీ వెబ్సైట్ లో “coming soon” అని టీజింగ్ చేస్తోంది. అయితే, ఇది కొన్ని రోజుల క్రితం టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ద్వారా మొదటిసారి గుర్తించబడింది. కానీ, టీజర్ పేజీని అందరికీ అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే, కంపెనీ వెబ్సైట్ లో ఈ ఫోన్ గురించి అందించిన టీజర్ ద్వారా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ ను తీసుకురాబోతున్నట్లు మాత్రం అర్ధమవుతోంది.
https://twitter.com/yabhishekhd/status/1519962509994004480?ref_src=twsrc%5Etfw
Vivo X80 సిరీస్ లో రెగ్యులర్ X80 మరియు X80 Pro మోడల్స్ ఉంటాయి. ముందుగా, వివో X80 తో మొదలుపెడితే ఈ ఫోన్ లో MEMC టెక్నాలజీతో 6.78-అంగుళాల E5 AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ల డిస్ప్లేలో సెంట్రల్ పంచ్ హోల్ డిజైన్ తో మరియు అందులో 32MP కెమెరాతో ఉంటుంది. ఇక వెనుక కెమెరాలలో OIS తో 50MP సోనీ IMX866 ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ మరియు 12MP (2x, 20x సూపర్ జూమ్) టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. మీరు ఇందులో Zeiss ఆప్టిక్స్, Zeiss T* కోటింగ్ మరియు V1+ ISPని కూడా పొందుతారు.
ఈ ఫోన్లలో LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్‌తో MediaTek డైమెన్సిటీ 9000 పైన అందించబడుతుంది. ఫోన్ 80W వైర్డు ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఇక X80 Pro మోడల్ విషయానికి వస్తే, ఇందులో 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన LTPO స్క్రీన్ తో వుంది. మీరు స్మార్ట్ ఫోన్ లో Qualcomm Snapdragon 8 Gen 1 లేదా MediaTek డైమెన్సిటీ 9000 వేరియంట్ లను ఎంచుకోవచ్చు. IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ మరియు స్క్రీన్ కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా ఇందులో పొందుతారు. ప్రో వేరియంట్ 80W వైర్డు ఛార్జింగ్ అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మద్దతునిస్తుంది.