ఇండియన్ మార్కెట్లో వివో తన కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అదే, వివో యొక్క X60 సిరీస్ స్మార్ట్ ఫోన్లు. ఈ ఫోన్లను స్పీడ్ మరియు కెమెరా ప్రధాన ప్రత్యేకతలతో తీసుకొచ్చింది. ఈ ఫోన్ సిరీస్ యొక్క ఫోన్లు కెమెరా పరంగా చాలా గొప్ప ఫీచర్లను కలిగి వున్నాయి. ఈ Vivo X60 సిరీస్ నుండి Vivo X60 Pro మరియు Vivo X60 Pro + స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది.
ఇక Vivo X60 Pro మరియు Vivo X60 Pro + స్మార్ట్ ఫోన్స్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా భారీ స్పెక్స్ తో వస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా FHD+ రిజల్యూషన్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేటుతో కలిగి ఉంటాయి మరియు మంచి ఆడియో కోసం ఎఫెక్ట్ కోసం Hi-Res ఆడియో చిప్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్ల కెమెరా మరియు ప్రాసెసర్ లలో భేదాలున్నాయి.
Vivo X60 Pro స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ కూడా తగినట్లుగా వుంటుంది. వివో X60 ప్రో 12GB ప్రధాన ర్యామ్ తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ని కూడా కలిగి ఉంటుంది. దీనికి తోడు ఈ ఫోన్ పెద్ద ఫైల్స్ ను కూడా సెకనులో యాక్సెస్ చేయగల 256GB UFS 3.1 స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.
కెమెరా పరంగా వివో X60 ప్రో వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 48MP మైన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ మరియు 13MP పోర్ట్రైట్ కెమెరాతో పాటుగా ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ తో అందించింది. ఈ ఫోన్ గొప్ప ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించ గలదని వివో చెబుతోంది.
ఈ X60 సిరీస్ లో హై ఎండ్ వేరియంట్ Vivo X60 Pro + స్మార్ట్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. వివో X60 ప్రో 12GB ప్రధాన ర్యామ్ తో పాటుగా 3GB వర్చువల్ ర్యామ్ ని కూడా కలిగి ఉంటుంది. దీనికి తోడు ఈ ఫోన్ పెద్ద ఫైల్స్ ను కూడా సెకనులో యాక్సెస్ చేయగల 256GB UFS 3.1 స్టోరేజ్ ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.
కెమెరా పరంగా వివో X60 ప్రో వెనుక క్వాడ్ కెమెరాతో వస్తుంది. ఇందులో 50MP మైన్ కెమెరాని లేటెస్ట్ Samsung ISOCELL GN1 సెన్సార్ ని, 48MP సెకండరీ సెన్సార్, 32MP సెన్సార్ ని మరియు 8MP టెలిఫోటో సెన్సార్ వున్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగివుంది. ఈ కెమెరా సిస్టం ను Zeiss ఆప్టిక్స్ మరియు Gimbal స్టెబిలైజేషన్ తో అందించింది. ఈ ఫోన్ అద్భుతమైన ప్రొఫెషనల్ ఫోటోలు మరియు వీడియోలను చిత్రీకరించ గలదని వివో చెబుతోంది.