Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్ విడుదల

Updated on 25-May-2021
HIGHLIGHTS

Vivo X60 సిరీస్ నుండి మరొక వేరియంట్ ను ప్రకటించింది

Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్ ను కూడా జతచేసింది

ఇది 120Hz రిఫ్రెష్ రేట్ గల FHD+ AMOLED ప్యానల్

ఇటీవల వివో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన Vivo X60 సిరీస్ నుండి మరొక వేరియంట్ ను ప్రకటించింది. ఈ Vivo X60 సిరీస్ నుండి ఇప్పటికే నార్మల్ ప్రో మరియు ప్రో ప్లస్ వేరియంట్స్ ఉండగా వీటికి Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్ ను కూడా జతచేసింది. ప్రస్తుతానికి, చైనాలో మాత్రమే ఈ Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్ ను విడుదల చేసింది.

కొత్తగా ప్రకటించిన ఈ Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్ ఫోన్ యొక్క స్పెషిఫికేషన్లు మాత్రం Vivo X60 నే పోలి ఉంటాయి. అయితే, ఈ Vivo X60 కర్వ్డ్ స్క్రీన్ ఎడిషన్  యొక్క స్క్రీన్ మాత్రం ఫ్లాట్ గా కాకుండా కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది మరియు మరింత స్టైల్ గా కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ గల FHD+ AMOLED ప్యానల్ మరియు స్క్రీన్ పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ తో వుంటుంది.

వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 48MP SonyIMX598 సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 13 ఎంపీ 50mm పోర్ట్రైట్ కెమెరా ఉంటాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వుంటుంది. అయితే, ఈ ఫోన్ Exynos 1080 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 4,300 mAh బ్యాటరీని 33W  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.                           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :