Vivo X300 pro 5G launched with professional grade camera in India
Vivo X300 5G Series నుంచి ఈరోజు రెండు స్మార్ట్ ఫోన్ లను వివో విడుదల చేసింది. వీటిలో Vivo X300 Pro 5G స్మార్ట్ ఫోన్ ను ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరా మరియు ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో పరిచయం చేసింది. ఈ వివో ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ మరియు గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్స్ కి తగ్గట్టు ఈ ఫోన్ ను ప్రీమియం సెగ్మెంట్ లో ఈరోజు లాంచ్ చేసింది.
వివో ఎక్స్ 300 ప్రో స్మార్ట్ ఫోన్ కేవలం సింగల్ వేరియంట్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను రూ. 1,09,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఎలైట్ బ్లాక్ మరియు డ్యూన్ గోల్డ్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ను కంపెనీ అనౌన్స్ చేసింది. ఈరోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ నిర్వహిస్తుంది. డిసెంబర్ 10వ తేదీ ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
ఈ ఫోన్ తో ఆకట్టుకునే లాంచ్ ఆఫర్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ పై వన్ ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ మరియు ఉచిత ఎయిర్ బడ్స్ ఆఫర్ అందించింది. ఇదే కాదు రూ. 11,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఈ ఫోన్ పై అందించింది. HDFC, Axis మరియు Kotak క్రెడిట్ కార్డు ఆప్షన్ పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంతేకాదు, PAYTM UPI తో పేమెంట్ చేసే వారికి కూడా ఈ ఫోన్ పై ఈ రూ. 11,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా స్పెషల్ మోడల్ ఫోన్ ఎక్స్చేంజ్ పై రూ. 11,000 మరియు ఇతర మోడల్ ఫోన్స్ పై రూ. 5,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
ఈ వివో లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెంటర్ లో అల్యూమినియం అల్లాయ్ బాడీ కలిగి ఉంటుంది మరియు ముందు వెనుక గ్లాస్ ఫైబర్ కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను చాలా ప్రీమియం డిజైన్ మరియు ఫీల్ తో అందించింది. ఈ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఇందులో 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ AMOLED స్క్రీన్ ను 1.5K+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 1–120 Hz LTPO రిఫ్రెష్ రేట్ మరియు 1 నిట్ బ్రైట్నెస్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ కేవలం 1.1mm అంచుతో ఫోన్ లో పూర్తిగా స్క్రీన్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ HDR 10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. వివో ఎక్స్ 300 ప్రో ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ జతగా V3+ చిప్ మరియు VS 1 చిప్ కూడా కలిగి ఉంటుంది. ఎక్స్ 300 ప్రో ఫోన్ 16 జీబీ LPDDR5X మరియు 512 జీబీ ఫాస్ట్ స్టోరేజ్ తో వస్తుంది.
కెమెరా పరంగా ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ సెన్సార్ మరియు సెటప్ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ ఫోన్ వెనుక 50MP (OIS) సోనీ మెయిన్ కెమెరా, 50MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 200MP టెలిఫోటో కెమెరా జతగా లేజర్ ఫోకస్ సెన్సార్ తో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120 FPS 4K డాల్బీ విజన్ వీడియోలు అందిస్తుంది. అంతేకాదు గొప్ప జూమ్, AI సపోర్ట్, గూగుల్ జెమినీ AI తో వచ్చే Veo 3 సపోర్టెడ్ వీడియోలు కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: OPPO A6x 5G: బిగ్ బ్యాటరీ మరియు బ్రెట్ డిస్ప్లేతో బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యింది.!
అలాగే, వివో వి ఎక్స్ 300 ప్రో ఫోన్ లో 60 FPS 4K వీడియో చిత్రించే 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. వివో ఎక్స్ 300 ప్రో ఫోన్ భారీ 6510 బిగ్ బ్యాటరీ తో వస్తుంది మరియు వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ తోపాటు 40W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ IP 68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.