Vivo V70 FE upcoming 200mp camera phone launch date announced
Vivo V70 FE : వివో అప్ కమింగ్ 200MP కెమెరా స్మార్ట్ ఫోన్ వివో వి 70 FE లాంచ్ డేట్ ను ఈరోజు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు కూడా వివో ఈరోజు రిలీజ్ చేసింది. వివో వి 70 సిరీస్ నుంచి ఇప్పటికే రెండు ఫోన్లు అందించిన వివో ఇప్పుడు ఈ ఫోన్ ను కూడా విడుదల చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ సిరీస్ లో బడ్జెట్ ఫోన్ గా వస్తుంది.
వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించింది మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రిలీజ్ చేసింది.
ఇక వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ గురించి వివో విడుదల చేసిన కీలక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లో దూల రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో CIPA 4.0 OIS అల్ట్రా స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెయిన్ కెమెరా మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ఐ AF గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో 30x సూపర్ జూమ్, సూపర్ మోషన్ స్నాప్ షాట్, మరియు AI వెథర్ చేంజ్ వంటి లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ లో ప్రీమియం డిస్ప్లే ప్రీమియం డిస్ప్లే సెటప్ కలిగి ఉన్నట్లు కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.8 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుందని వివో తెలిపింది. ఇది కాకుండా ఆడియోకి తగిన సౌండ్ అందించే డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో అందించింది.
ఇక డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వివో డార్క్నెస్ గ్లో టెక్నాలజీ కలిగి మొదటి ఫోన్ గా వస్తోంది. ఇది చీకటిగా ఉన్నప్పుడు వెనుక ప్యానల్ వెలుగుతుంది. ఈ ఫోన్ IP 68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల లోతులో రెండు గంటల వరకు వాటర్ ను తట్టుకునే శక్తితో అందించినట్లు వివో గొప్పగా తెలిపింది.
ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ ఉందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇదే కాదు ఈ ఫోన్ 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా ఈ బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.