Vivo V70 FE price and specs know ahead of launch
Vivo V70 FE: వివో వి 70 సిరీస్ నుంచి వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను రేపు లాంచ్ చేస్తుంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కావడానికి ఒక రోజు ముందుగా ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ నెట్టింట్లో లీకయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ లీక్డ్ ప్రైస్ అండ్ ఫీచర్స్ చూస్తుంటే, ఈ ఫోన్ మిడ్ రెండు బీస్ట్ గా మార్కెట్లో అడుగు పెడుతుందని అర్ధం అవుతుంది. ముఖ్యంగా, ఈ ఫోన్ 200MP బిగ్ కెమెరాతో లంచ్ అవుతోంది.
ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అవుతుందని లీక్స్ వెల్లడించాయి. ఈ మూడు వేరియంట్స్ మరియు వాటి ప్రైస్ వివరాలు లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
వివో వి70FE (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 37,999
వివో వి70FE (8 జీబీ + 256 జీబీ) ప్రైస్ : రూ. 40,999
వివో వి70FE (12 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 44,999
పైన తెలివైన ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని అనేక లీక్స్ పేర్కొన్నాయి. అయితే, రేపు ఫోన్ లాంచ్ తర్వాత ఈ లీక్డ్ ప్రైస్ మాటల్లో నిజం ఎంతో తెలుస్తుంది.
Also Read: Samsung 120W Dolby Atmos స్పీకర్ జబర్దస్త్ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది.!
వివో వి70FE ఫోన్ లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫాస్ట్ చిప్ సెట్ మీడియాటెక్ Dimensity 7360 Turbo తో లాంచ్ అవుతుంది. ఇందులో మరింత 12 జీబీ వరకు ర్యామ్ మరియు 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ అందించింది. ఈ ఫోన్ కలిగిన ఈ రెండు స్పెక్స్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో గేమింగ్ మరియు ఫుల్ ఎంటర్టైన్మెంట్ 6.83 ఇంచ్ బిగ్ OLED స్క్రీన్ అందించింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సపోర్ట్ వంటి డీటెయిల్స్ తో వస్తుంది. అంతేకాదు, 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ CIPA 4.0 OIS అల్ట్రా స్టెబిలైజేషన్ తో 200MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు 50MP AF గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ సూపర్ మోషన్ స్నాప్ షాట్ మరియు AI వెథర్ చేంజ్ వంటి అనేక లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది కాకుండా 7000 mAh బిగ్ బ్యాటరీ తో కూడా ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.