200MP కెమెరాతో వి 60 సిరీస్ నుండి కొత్త Vivo V60e లాంచ్ అవుతోంది.!

Updated on 29-Sep-2025
HIGHLIGHTS

వివో వి 60 సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం vivo కొత్తగా మొదలు పెట్టింది

స్టన్నింగ్ డిజైన్ మరియు 200MP పవర్ఫుల్ కెమెరాతో విడుదల చేస్తున్నట్లు వివో వెల్లడించింది

ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఎలీట్ పర్పల్ రెండు రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది

వివో వి 60 సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం vivo కొత్తగా మొదలు పెట్టింది. Vivo V60e స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు 200MP పవర్ఫుల్ కెమెరాతో విడుదల చేయడానికి సిద్ధమైనట్లు టీజర్ ద్వారా వివో వెల్లడించింది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Vivo V60e : లాంచ్ డేట్?

వివో వి 60e స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఈ ఫోన్ లాంచ్ కోసం ‘కమింగ్ సూన్’ బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం వివో అఫీషియల్ సైట్ నుంచి అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ మాత్రం అందించింది. ఈ ఫోన్ నోబెల్ గోల్డ్ మరియు ఎలీట్ పర్పల్ రెండు రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.

Vivo V60e : ఫీచర్స్

గత వెర్షన్ ఫోన్ వివో వి 50e తో పోలిస్తే ఈ ఫోన్ సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఇది చాలా స్లీక్ డిజైన్ మరియు సరికొత్త లగ్జరీ రంగులో వస్తుంది. ఈ ఫోన్ అల్ట్రా స్లిమ్ బెజెల్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫుల్ బాడీ డ్రాప్ ప్రొటెక్షన్ తో ఉంటుంది మరియు IP68 / IP69 తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది.

ఇక వివో వి సిరీస్ స్పెషల్ గా చెప్పబడే కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో ఈసారి భారీ సెన్సార్ సెటప్ అందించిందని చెప్పాలి. ఎందుకంటే, ఈ ఫోన్ లో వెనుక 200MP OIS ప్రధాన కెమెరా జతగా 8MP వైడ్ యాంగిల్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. 200MP కెమెరా కలిగిన మొదటి ఫోన్ గా ఈ వివో వి 50e స్మార్ట్ ఫోన్ నిలుస్తుంది.

ఈ పవర్ ఫుల్ సెన్సార్ కలిగిన కెమెరా సెటప్ తో ఈ ఫోన్ అల్ట్రా HD ఫోటోలు అందిస్తుందని వివో ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ 85mm క్లోజప్ ప్రో పోర్ట్రైట్ ఫోటోలు, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్ తో సూపర్ స్టేబుల్ వీడియోలు ఎం మరియు ఫోటోలు అందిస్తుందని కూడా వివో తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI ఫెస్టివల్ పోర్ట్రైట్, AI ఇమేజ్ ఎక్స్ ప్యాండర్ మరియు మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.

Also Read: Jio Super Plan: కేవలం రూ. 449 సింగల్ రీఛార్జ్ తో మూడు నెంబర్లు వాడుకోవచ్చు.!

ఈ ఫోన్ 6500 భారీ బ్యాటరీ మరియు 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ అవుతుంది. త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించే అవకాశం ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :