Vivo V60 స్మార్ట్ ఫోన్ ZEISS 50MP సూపర్ టెలిఫోటో కెమెరాతో లాంచ్ అవుతుంది.!

Updated on 30-Jul-2025
HIGHLIGHTS

Vivo V60 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో ఇండియాలో టీజింగ్ మొదలు పెట్టింది

వివో వి50 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి వివో సిద్దమయ్యింది

ZEISS 50MP సూపర్ టెలిఫోటో కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు Vivo గొప్పగా చెబుతోంది

Vivo V60 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో ఇండియాలో టీజింగ్ మొదలు పెట్టింది. వివో వి50 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా ఈ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేయడానికి వివో సిద్దమయ్యింది. ఈ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అధికారిక వెబ్సైట్ మరియు అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ పోస్ట్ లను విడుదల చేస్తోంది. ఈ ఫోన్ ను ZEISS 50MP సూపర్ టెలిఫోటో కెమెరాతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది.

Vivo V60

వివో ఈ ఫోన్ కోసం టీజింగ్ మాత్రమే మొదలు పెట్టింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించిన కంపెనీ అఫీషియల్ సైట్ నుంచి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ డిజైన్ డిజైన్ మరియు కెమెరా వివరాలు వెల్లడించే టీజర్ ఇమేజ్ ను కంపెనీ రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉన్నట్లు క్లియర్ చేసింది.

కేవలం డిజైన్ మాత్రమే కాదు ఈ ఫోన్ కెమెరా వివరాలు కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు ఇందులో ZEISS కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ZEISS 50MP సూపర్ టెలిఫోటో కెమెరా ఉన్నట్లు వివో టీజర్ వీడియో ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఇది 100x వరకు జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ బ్యాటరీ వివరాలు కూడా వివో బయటపెట్టింది.

వివో వి 60 స్మార్ట్ ఫోన్ 6500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ లాంచ్ అవుతుంది.ఈ కేటగిరిలో పెద్ద బ్యాటరీ కలిగిన స్లిమ్ ఫోన్ గా ఇది నిలుస్తుందని వివో తెలిపింది. వివో వి 60 స్మార్ట్ ఫోన్ అందమైన లుక్స్ కలిగిన డిజైన్ మరియు కంఫర్ట్ డిజైన్ తో ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త ఆస్పేషియస్ గోల్డ్, మూన్ లైట్ బ్లూ మరియు మిస్ట్ గ్రే మూడు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Also Read: Motorola G86 Power: సూపర్ HD డిస్ప్లే మరియు 4K కెమెరాతో బడ్జెట్ ధరలో రిలీజ్ అయ్యింది.!

Vivo V60 : అంచనా స్పెక్స్

వివో వి60 అంచనా స్పెక్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది కాకుండా, ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉండే అవకాశం ఉందని కూడా ఊహించి చెబుతున్నారు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిస్కోప్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్ లు అంచనా వేస్ చెబుతున్నారు.

వివో వి60 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్మెంట్ తో పాటు ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లు కూడా త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, అంచనా స్పెక్స్ యెంత వరకు నిజం అవుతాయో ముందు ముందు తెలుస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :