Vivo V60 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!

Updated on 28-Jul-2025
HIGHLIGHTS

Vivo V60 ఇండియా లాంచ్ గురించి కంపెనీ అప్డేట్ విడుదల చేసింది

వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన V సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది

ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది

Vivo V60 ఇండియా లాంచ్ గురించి కంపెనీ అప్డేట్ విడుదల చేసింది. వివో ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిరీస్ అయిన V సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లాంచ్ అనౌన్స్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా వెల్లడించింది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాము.

Vivo V60 : లాంచ్ డేట్

వివో వి60 స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ యొక్క ఖచ్చితమైన డేట్ మరియు టైం వివరాలు వివో ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ ను ‘Coming Soon’ ట్యాగ్ తో టీజింగ్ చేస్తోంది. వివో ఈ ఫోన్ లాంచ్ డేట్ వివరాలు అందించలేదు కానీ, ఈ ఫోన్ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్లు మాత్రం రివీల్ చేసింది. వివో అఫీషియల్ X హ్యాండిల్ నుంచి ఈ ఫోన్ లాంచ్ టీజర్ పోస్ట్ ను షేర్ చేసింది. అలాగే, వివో అఫీషియల్ సైట్ నుంచి ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు వెల్లడించింది.

Vivo V60 : కీలక ఫీచర్లు

వివో వి60 స్మార్ట్ ఫోన్ ZEISS పోర్ట్రైట్ ప్రో కెమెరాతో లాంచ్ అవుతుందని వివో టీజింగ్ చేస్తోంది. ఇందులో ట్రిపుల్ జీస్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. అంటే, ఈ ఫోన్ లో వెనుక మూడు జీస్ కెమెరాలు ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ సూపర్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ జూమ్ కెపాసిటీ గురించి ఈ టీజర్ పేజీలో వివో హింట్ అందించింది. ఈ ఫోన్ 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుందని వివో ప్రకటించింది.

వివో అప్ కమింగ్ ఫోన్ వి60 యొక్క డిస్ప్లే వివరాలు కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ ను సమానమైన డెప్త్ కలిగిన క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ వ్యూ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని వివో తెలిపింది. ఈ ఫోన్ ను మూడు సరికొత్త రంగుల్లో అందిస్తున్నట్లు వివో ప్రకటించింది. ఈ ఫోన్ ఆస్పేషియస్ గోల్డ్, మూన్ లైట్ బ్లూ మరియు మిస్ట్ గ్రే ముందు రంగుల్లో లాంచ్ అవుతుంది.

Also Read: iQOO Z10R: భారీ సింగల్ డే ఆఫర్స్ తో మొదటి సేల్ కోసం సిద్ధమైన ఐకూ కొత్త ఫోన్.!

వివో ఈ ఫోన్ ఫస్ట్ లుక్ అందించే టీజర్ ఇమేజ్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ ఫోన్ ఇమేజ్ చూస్తుంటే ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే, ఈ విషయం కంపెనీ కన్ఫర్మ్ చేయాల్సి వుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్లు కూడా వివో త్వరలోనే అందించవచ్చు. ఈ ఫోన్ కొత్త అప్డేట్ మరియు లాంచ్ డేట్ వంటి పూర్తి వివరాలతో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :