Vivo V60 టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

Updated on 05-Aug-2025
HIGHLIGHTS

Vivo V60 వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది

వారం రోజుల ముందే ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ అందిస్తున్నాము

ఇప్పటి V సిరీస్ నుంచి వచ్చిన ఏ ఫోన్ కూడా యూజర్‌లను నిరాశ పరచలేదు

వివో వి సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V60 వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది. అయితే, ఈ ఫోన్ మార్కెట్ లోకి రావడానికి వారం రోజుల ముందే ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి. ఈ ఫోన్ డిజైన్ మరియు కెమెరా పరంగా గొప్ప హైప్ ను సంపాదించుకుంది. వాస్తవానికి, ఇప్పటి V సిరీస్ నుంచి వచ్చిన ఏ ఫోన్ కూడా యూజర్‌లను నిరాశ పరచలేదు. అందుకే, వివో వి సిరీస్ నుండి కొత్త ఫోన్ వస్తుందంటే స్వతహాగానే మార్కెట్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఈ సిరీస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.

ఈ వివో స్మార్ట్ ఫోన్ ఆగస్టు 12వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టీజింగ్ కోసం వివో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫాలెన్ యొక్క కొన్ని వివరాలు వెల్లడించింది.

Vivo V60 టాప్ 5 ఫీచర్స్

కెమెరా

ఈ ఫోన్ టాప్ వన్ ఫీచర్ కెమెరా అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, వివో ఈ ఫోన్ ను 50MP ZEISS కెమెరా తో లాంచ్ చేస్తుంది. ఇందులో వెనుక 50MP మెయిన్ జతగా 50 MP ZEISS సూపర్ టెలిఫోటో కెమెరా మరియు జీస్ అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ మరియు ముందు 50MP జీస్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ వెడ్డింగ్ స్పెషల్ ఫిల్టర్స్, AI కెమెరా ఎడిటింగ్ టూల్స్ మరియు ప్రత్యేకమైన ZEISS కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.

డిజైన్

ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఇది చాలా స్లీక్ ఉంటుంది మరియు కర్వుడ్ డిస్ప్లే మరియు బాడీ తో చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మూన్ లైట్ బ్లూ, ఆస్పేషియస్ గోల్డ్ మరియు మిస్ట్ గ్రే మూడు రంగుల్లో వస్తుంది.

పెర్ఫార్మెన్స్

ఈ వివో లేటెస్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ చిప్ సెట్ వివరాలు కూడా వివో విడుదల చేసింది. అదేమిటంటే, ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు ఇప్పటికే వివో కన్ఫర్మ్ చేసింది. ఈ చిప్ సెట్ తో జతగా LPDDR5X ర్యామ్ మరియు మరింత వేగవంతమైన UFS హెవీ స్టోరేజ్ కూడా అందించే అవకాశం ఉంటుంది.

డిస్ప్లే

ఈ ఫోన్ ఫుల్ వ్యూ అందించే క్వాడ్ కర్వుడ్ డిస్ప్లేని అంచులు లేకుండా ఉండేలా కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే ఫీచర్లు పూర్తిగా అందించలేదు. కానీ, ఈ ఫోన్ లో గేమింగ్ మరియు కంటెంట్ కోసం అనువైన గొప్ప డిస్ప్లే ఉండే అవకాశం మెండుగా ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, గొప్ప బ్రైట్నెస్, HDR సపోర్ట్ మరియు గొప్ప రిఫ్రెష్ రేట్ కలిగి ఉండవచ్చు.

Also Read: Sony 5.1Ch Dolby Atmos సౌండ్ బార్ పై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!

డ్యూరబిలిటీ & OS

ఈ ఫోన్ మార్కెట్ టాప్ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ గ్రేడ్ ఫోన్ గా వస్తుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ అండర్ వాటర్ లో కూడా 120 నిమిషాలు తట్టుకొని నిలబడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఫన్ టచ్ OS 15 జతగా ఆండ్రాయిడ్ 15 తో లాంచ్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :