Vivo V50
Vivo V50 స్మార్ట్ ఫోన్ లాంచ్ ను వివో ప్రకటించింది. అయితే, ఈ సిరీస్ నుంచి ఈ ఫోన్ ప్రో వేరియంట్ ను కూడా జతగా విడుదల చేస్తుందని నెట్టింట్లో రూమర్స్ విచ్చల విడిగా సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే, ఇది నిజం కావచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, చైనా మార్కెట్ లో నవంబర్ నెలలో వివో S సిరీస్ నుంచి విడుదల చేసిన S20 మరియు S20 Pro ఫోన్ లను ఇండియాలో విడుదల చేస్తుందని అంచనా వేసి ఈ విషయాన్ని చెబుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే వివో వి 50 సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
వివో ప్రస్తుతానికి వివో వి 50 లాంచ్ డేట్ కానీ వివో వి 50 ప్రో ఇండియాలో లాంచ్ చేస్తుందని కానీ ప్రకటించలేదు. అయితే, ఈ రెండు ఫోన్లు ఫిబ్రవరి 18న ఇండియాలో లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేసి చెబుతున్నాయి. అయితే, ఎంత వరకూ నిజం ఉందో త్వరలో తెలుస్తుంది.
Also Read: Valentine’s Day 2025 కానుకగా ఇవ్వతగిన బెస్ట్ బడ్జెట్ Smartwatch డీల్స్ ఇవిగో.!
వివో వి 50 ప్రో స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉండవచ్చు. వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9300+ చిప్ సెట్ మరియు జతగా వేగవంతమైన LPDDR5X ర్యామ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కలిగి ఉండే అవకాశం వుంది.
వివో ఈ ఫోన్ ను ట్రిపుల్ రియర్ 50MP కెమెరా మరియు 50MP సెల్ఫీ కెమెరాతో లాంచ్ చేసే అవకాశం ఉండవచ్చు. ఇది కాకుండా ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ ను Android 15 OS తో కూడా అందిస్తుంది.
అయితే, పైన తెలిపిన స్పెక్స్ మరియు ఫీచర్స్ అన్ని కూడా కేవలం అంచనా వేసి చెప్పబడినవి మాత్రమే అని గమనించాలి. వివో ఈ వివో వి 50 ప్రో ఫోన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదని కూడా గుర్తుంచుకోండి.
Note: మెయిన్ ఇమేజ్ వివో వి 50 టీజర్ ఇమేజ్ ని గమనించాలి