Vivo V50 Price Leaked ahead of launch of next week
Vivo V50 Price Leaked: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి50 స్మార్ట్ ఫోన్ వచ్చే వారం విడుదల కాబోతుంది. అయితే, ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఇప్పుడు ఆన్లైన్ లో లీక్ అయ్యింది. ఇది రూమర్ అయినా కూడా వాస్తవానికి దగ్గరగా ఉండవచ్చని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఫోన్ యొక్క ప్రైస్ లీక్ మరియు రూమర్స్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.
వివో వి 50 స్మార్ట్ ఫోన్ ధర రూ. 35,000 నుంచి రూ. 40,000 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 8GB ర్యామ్ మరియు 128GB వేరియంట్ ధర రూ. 34,999 ఉందవచ్చని అంచనా వేసున్నారు. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 256GB వేరియంట్ రూ. 36,999 ధరతో మరియు 12GB + 256GB హై ఎండ్ వేరియంట్ ధర రూ. 40,999 ధరతో ఉండవచ్చని అంచనా. ఈ ధర వివరాలు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోన్ ఫిబ్రవరి 17న లాంచ్ అవుతుంది కాబట్టి లాంచ్ నాటికి ఈ ఫోన్ ప్రైస్ వివరాలు తెలుస్తాయి.
Also Read: మంచి ఆఫర్స్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ Smart Tv డీల్స్ ఇవే.!
ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను ఇప్పటికే వివో భయపెట్టింది. ఈ ఫోన్ చాలా సన్నని స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. వివో వి 50 స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది అధిక బ్రైట్నెస్, అధిక రిఫ్రెష్ రేట్ వంటి మరిన్ని ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను IP68 మరియు IP69 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో గొప్ప కెమెరా సెటప్ అందించినట్లు కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ మరియు 50MP అల్ట్రా వైడ్ ZEISS కెమెరాలతో పటు ముందు కూడా 50MP ZEISS సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప కెమెరా ఫిలీటర్లు మరియు ఫీచర్స్ ను జత చేసినట్లు కూడా వివో ప్రకటించింది. ఈ ఫోన్ AI సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. వివో వి 50 ఫోన్ 90W అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.