vivo V40 5G ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ZEISS ప్రీమియం కెమెరా సెటప్ తో వచ్చింది.!

HIGHLIGHTS

vivo ఈరోజు ఇండియాలో V40 సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది

vivo V40 5G ను మిడ్ రేంజ్ ధరలో ZEISS ప్రీమియం కెమెరా సెటప్ తో తీసుకు వచ్చింది

వివో వి 40 స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది

vivo V40 5G ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ZEISS ప్రీమియం కెమెరా సెటప్ తో వచ్చింది.!

vivo ఈరోజు ఇండియాలో V40 సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది. ఇందులో vivo V40 5G స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ZEISS ప్రీమియం కెమెరా సెటప్ తో తీసుకు వచ్చింది. ఈ ఫోన్ డిజైన్ మొదలుకొని కెమెరా వరకు అన్ని విషయాల్లో కూడా వివో కొత్త ఫోన్ మంచి ఫీచర్లను కలిగి వుంది. వివో సరికొత్తగా విడుదల చేసిన ఈ వివో వి 40 5జి స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

vivo V40 5G : ధర

వివో వి 40 స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఇక్కడ చూడవచ్చు

వివో వి 40 (8GB + 128GB) వేరియంట్ ధర రూ. 34,999

వివో వి 40 (8GB + 256GB) వేరియంట్ ధర రూ. 36,999

వివో వి 40 (12GB + 512GB) వేరియంట్ ధర రూ. 41,999

ఈరోజు నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ లను వివో మొదలు పెట్టింది.

ఆఫర్లు

వివో వి 40 స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు వివో అందించింది. ఈ ఫోన్ ను HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లు 10% ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు లేదా ఫోన్ ఎక్స్ చేంజ్ పైన 10% డిస్కౌంట్ ను పొందవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పైన No Cost EMI ఆఫర్ ను కూడా అందించింది.

Also Read: HMD Crest 5G స్మార్ట్ ఫోన్ అమెజాన్ సేల్ నుంచి భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది.!

vivo V40 5G : ఫీచర్స్

వివో వి 40 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ Zeiss కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఇందులో 50 MP AF+OIS (ZEISS) మెయిన్ + 50 MP AF (ZEISS) వైడ్ యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఓ ముందు కూడా 50MP (AF) సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ స్మార్ట్ ఆరా లైట్ తో జతగా వస్తుంది. ఈ ఫోన్ లో Zeiss మల్టీ ఫోకాల్ పోర్ట్రైట్, స్టైల్ పోర్ట్రైట్ వంటి అనేకమైన Zeiss ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ తో అద్భుతమైన ఫోటోలు పొందవచ్చని వివో తెలిపింది.

vivo V40 5G Features

వి 40 ఫోన్ లో 6.78 ఇంచ్ అల్ట్రా స్లిమ్ 3D కర్వుడ్ AMOLED డిస్ప్లే వుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్నెస్ మరియు FHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో నడుస్తుంది. దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో 5500 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo