ViVO V25 Pro: 3D కర్వ్డ్ డిస్ప్లే మరియు 64ఎంపి OIS కెమెరాతో లాంచ్.!

HIGHLIGHTS

వివో ఈరోజు ఇండియాలో V25 సిరీస్ నుండి ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

వి25 ప్రో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో లాంచ్

ఈ ఫోన్ కొనేవారికి రూ.3,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది

వివో ఈరోజు ఇండియాలో V25 సిరీస్ నుండి ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. వివో ఈసారి ఫీచర్లను పెంచి ధరను మాత్రం మిడ్ రేంజ్ యూజర్లను దృష్టిలో ఉంచుకొని ప్రకటించినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే, వి25 ప్రో స్మార్ట్ ఫోన్ ను 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 64ఎంపి OIS సూపర్ నైట్ పోర్ట్రైట్ ట్రిపుల్ కెమెరా వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో కేవలం మిడ్ రేంజ్ ధరలో అందించింది. వివో నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్ లను పూర్తిగా తెలుసుకోండి.

ViVO V25 Pro: ధర మరియు ఆఫర్లు

 వివో వి25 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ధర రూ.35,999. ఈ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ.39,999. ఈ ఫోన్ పైన కంపెనీ లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్స్ మరియు EMI అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి రూ.3,500 ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, పాత ఫోన్ ఎక్స్చేంజ్ పైన 3,000 రూపాయల బోనస్ వంటి ఆఫర్లను అందించింది.                                       

ViVO V25 Pro: స్పెసిఫికేషన్స్

Vivo V20 Pro స్మార్ట్ ఫోన్ 6.56-అంగుళాల FHD+ (2376 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగిన 3D కర్వ్డ్ డిస్ప్లేని కలిగివుంది, అదీకూడా AMOLED ప్యానెల్‌ను ఉపయోగించింది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్ తో తయారు చేయబడింది, కాబట్టి ఇది రంగులు మారుస్తుంది. వి 25 ప్రో 12 జిబి ర్యామ్ మరియు 256 జిబి స్టోరేజ్‌తో మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 శక్తితో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 పై ఆధారపడి FuntouchOS 12 పై నడుస్తుంది.

వివో వి 25 ప్రో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో OIS 64 ఎంపి ప్రాధమిక కెమెరా, 8 ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2 ఎంపి మ్యాక్రో సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 32MP Eye AF సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. V25 ప్రో 66W ఫ్లాష్ ఛార్జ్ 4 సపోర్ట్ కలిగిన 4,830mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :