Vivo V23 Pro: త్వరలో లాంచ్ కానుంది..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..!

Updated on 21-Dec-2021
HIGHLIGHTS

Vivo V23 Pro అతి త్వరలో విడుదల కాబోతున్నట్లు అనేక లీక్స్ వెల్లడించాయి. అయితే, కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం, ఈ వివో వి23 ప్రో ఫోన్ జనవరి మొదటి వారంలో విడుదల కానున్నట్లు వెల్లడించాయి. ఇది మాత్రమే కాదు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ఫోన్ యొక్క  లాంచ్ డేట్ గురించి కూడా కొంత సమాచారం అందుకున్నాము.

Vivo V23 Pro: లాంచ్ డేట్

కంపెనీకి సన్నిహితంగా ఉన్న సోర్స్ ల ద్వారా ఈ గురించి కొంత సమాచారం తెలుసుకోగలిగాము. దీని ప్రకారం, ముందుగా వచ్చిన రిపోర్ట్ సూచించినట్లుగా ఈ ఫోన్ జనవరి 4 న లాంచ్ చేయడానికి బదులుగా వారం చివరి వరకూ విడుదల చేయబడుతుంది. ఇది మాత్రమే కాదు అదే సోర్స్ ద్వారా ఫోన్ డిజైన్ ను గురించి కూడా కొంత సమాచారాన్ని పొందగలిగాము.

ఈ ఫోన్ లాంచ్ అయిన తరువాత "7.36mm మందం కలిగిన భారతదేశపు అత్యంత సన్నని 3D కర్వ్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్" నిలుస్తుందని పేర్కున్నారు. ఈ ఫోన్ గురించి  మరే ఇతర వివరాలను వెల్లడించలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలియరావచ్చు.

అయితే, ఈ ఫోన్ అంచనా స్పెక్స్ మాత్రం ఈ ఫోన్ భారీ ఫీచర్లతోనే విడుదల మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని సూచిస్తున్నాయి.

Vivo V23 Pro: అంచనా స్పెక్స్

Vivo V23 Pro స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 1200 చిప్‌సెట్ శక్తితో వచ్చే అవకాశం వుంది. అంతేకాదు, ఇది 8GB ర్యామ్ తో జతచేయబడుతుందని కూడా భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED డిస్ప్లే, 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 5GB వర్చువల్ మెమోరిని కూడా ఈ ఫోన్ లో జోడించవచ్చని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :