Vivo V20 SE స్మార్ట్ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్ తో రిలీజ్

HIGHLIGHTS

Vivo V 20 SE స్మార్ట్ ఫోన్ V20 లైనప్లో సరసమైన ఫోనుగా భారతదేశంలో అడుగుపెట్టింది.

ఈ V20 SE అనేది వివో V20 యొక్క టోన్-డౌన్ వెర్షన్

వివో V20 ప్రో కూడా ఈ నెలాఖరులో రాబోతుంది.

Vivo V 20 SE స్మార్ట్ ఫోన్ V20 లైనప్‌లో సరసమైన ఫోనుగా భారతదేశంలో అడుగుపెట్టింది. ఈ V20 SE అనేది వివో V20 యొక్క టోన్-డౌన్ వెర్షన్, ఇది గత నెలలో భారతదేశంలో ప్రారంభించబడింది. V20 SE మరియు V20 సిరీస్‌లోని రెండు ఫోన్లు మాత్రమే కాకుండా, వివో V20 ప్రో కూడా ఈ నెలాఖరులో రాబోతుంది.

Vivo V 20 SE : ధర మరియు లభ్యత

వివో వి 20 ఎస్ఇ సింగిల్ 8 జిబి + 128 జిబి మోడల్‌ కేవలం రూ .20,990 ధరతో ప్రకటించబడింది మరియు నవంబర్ 3 నుంచి వివో ఇండియా స్టోర్, ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫాంలు మరియు భారతదేశంలోని ప్రధాన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Vivo V 20 SE స్పెసిఫికేషన్లు

వివో వి 20 ఎస్ఇ ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది, ఇది 7.8 మిల్లీమీటర్ల మందం మరియు 171 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.44-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సెల్ఫీ కెమెరా కోసం వాటర్‌డ్రాప్ నాచ్ మరియు స్క్రీన్‌లో వేలిముద్ర సెన్సార్‌తో AMOLED స్క్రీన్ తో  అలరిస్తుంది. ఇది రెండు రంగులలో అందించబడుతోంది – గ్రావిటీ బ్లాక్ మరియు ఆక్వామారిన్ గ్రీన్

V20 SE ను ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 610 GPU తో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. డేడికేటెడ్ మైక్రో ఎస్‌డి కార్డులను ఉపయోగించడం ద్వారా 1 TB వరకూ స్టోరేజ్ ను విస్తరించే ఎంపిక ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత FunTouch OS 11 లో నడుస్తుంది.

వివో వి 20 ఎస్ఇ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో  ఎఫ్ / 1.8 ఎపర్చరు ప్రాధమిక 48MP కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో, సూపర్ నైట్ మోడ్ మరియు బ్రైట్నెస్ స్క్రీన్ లైట్ వంటి లక్షణాలతో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

V20 SE లో 4,100mAh బ్యాటరీ ఉంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ తో వస్తుంది. కేవలం 30 నిమిషాల్లో ఫోన్ 0-62 శాతం వరకూ ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :