వివో అప్ కమింగ్ ఫోన్ ఫీచర్లు అదుర్స్.!

HIGHLIGHTS

ViVO V25 Pro ఆగష్టు 17 న విడుదలవుతోంది

V25 Pro భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో వస్తునట్టు అర్ధమవుతోంది

V25 Pro లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది

ఇండియాలో తన కొత్త సిరీస్ ఫోన్లను విడుదల చెయ్యడానికి వివో లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా టీజింగ్ ద్వారా వెల్లడించింది. మనం మాట్లాడుకుంటున్నది ViVO V25 Pro స్మార్ట్ ఫోన్ గురించి మరియు ఈ ఫోన్ ను వివో ఇండియాలో ఆగష్టు 17 న విడుదల చేస్తోంది. ఈ ఫోన్ తో పాటుగా ఈ సిరీస్ నుండి మరికొన్ని ఫోన్లను కూడా లాంచ్ చెయ్యవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. టీజింగ్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం, V25 Pro భారీ ఫీచర్లు మరియు స్పెక్స్ తో వస్తునట్టు అర్ధమవుతోంది. Vivo V25 సిరీస్ ఆగస్టు 17న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ చేస్తుంది.

ViVO V25 Pro: రివీల్డ్ స్పెక్స్

V25 Pro లో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది మరియు FHD+ రిజల్యూషన్‌ తో ఉంటుంది. వివో వి25 ప్రో స్మార్ట్ ఫోన్ వెనుక రంగు మార్చే బ్యాక్ ప్యానెల్ ను అందించింది. V23 సిరీస్‌లో చూసినట్లుగా ఫ్లోరైట్ AG గ్లాస్ ఉపయోగించడం వల్ల ఈ కలర్ చేంజ్  జరుగుతుంది. ఈ ఫోన్ సెయిలింగ్ బ్లూ కలర్‌తో రెండు కలర్ అప్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

కెమెరా విభాగంలో, V25 ప్రో కూడా OIS సపోర్ట్ కలిగిన 64MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు సూపర్ నైట్ పోర్ట్రెయిట్, వ్లాగ్ మూవీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుందని నిర్ధారించబడింది. అంతేకాదు, OISకి సపోర్ట్ కలిగి 4K రిజల్యూషన్ లో షూట్ చేసే 32MP సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్ లో ఉంటుందని ఉంటుందని భావిస్తున్నారు.

V25 Pro స్మార్ట్ ఫోన్ Dimensity 1300 చిప్‌సెట్ శక్తితో పనిచేస్తుంది మరియు మల్టీ RAM మరియు స్టోరేజ్ వేరియంట్‌ లతో జత చేయబడిందని Vivo ధృవీకరించింది. V25 ప్రోలో 4,830mAh బ్యాటరీ కూడా అమర్చబడింది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్‌కు మద్దతు ఇస్తుంది.   

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :