Vivo నుంచి ఊసరవెల్లిలా రంగులు మార్చే స్మార్ట్ ఫోన్

Updated on 25-Jul-2022

వివో సంస్థ వినూత్నమైన స్మార్ట్ ఫోన్ ఆవిష్కరాన్ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకంగా ఇచ్చిన ఒక బటన్ నొక్కినప్పుడు రంగులను మార్చే వెనుక ప్యానల్ ‌తో ఈ స్మార్ట్‌ ఫోన్‌ ను అభివృద్ధి చేస్తోంది. మొదట ఏ కంపెనీ పేరు లేకుండా ఒక వీడియోను ఆన్‌ లైన్ ‌లో పోస్ట్ చేశారు. ఇందులో, ఒక బటన్ నొక్కినప్పుడు రంగులు మారినట్లు కనిపించే ఫోన్ ‌ను ప్రదర్శిచారు. అయితే, తరువాత ఇది వివో ఫోన్ అని అధికారికంగా ధృవీకరించి, ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ వాడకాన్ని వర్ణించే సుదీర్ఘ వీడియోను విడుదల చేసింది.

వివో దాని రంగు మారుతున్న ఫోన్‌ను చూపిస్తుంది

ఈ సంవత్సరం ప్రారంభంలో OnePlus Concept వన్ ప్రోటోటైప్‌ లో ఎలెక్ట్రోక్రోమిక్ గ్లాస్ వాడకాన్ని మేము మొదటగా చూశాము. కెమెరా యాప్  ఓపెన్ చేయనంత వరకూ కెమెరా సెన్సార్లు కనిపించకుండా ఉండేలా చేయడానికి ఈ పదార్థం ఉపయోగించబడింది. కెమెరా యాప్ తెరిచిన వెంటనే, కెమెరా బయటకి  కనిపిస్తుంది  మరియు వాటిని పూర్తిగా చూడవచ్చు.

 

https://twitter.com/StationChat/status/1301375659869196293?ref_src=twsrc%5Etfw

 

Weibo లో వివో షేర్ చేసిన వీడియోలో, వెనుక ప్యానెల్ ఉన్న ఈ ఫోన్ ‌ను మనం చూడవచ్చు, ఇది వైట్ మరియు బ్లూ షేడ్‌ల మధ్య రంగును మారుస్తుంది. అయితే  వీడియోలో ఉన్న వ్యక్తి ఈ మార్పు జరగడానికి సైడ్-బటన్‌ను నొక్కడం కనిపిస్తుంది. వీడియోలో ప్రదర్శించబడే ఫోన్ దాని కెమెరా మాడ్యూల్‌ ను కవర్ చేయగా, అసలు వీడియో డ్యూయల్-LED ఫ్లాష్ ‌తో పాటు వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ గురించి ఒక అవగాహన ఇచ్చింది.

ఇంతకుముందు లీక్ అయిన మరొక వీడియోలో, సైడ్ బటన్ నుండి బొటన వేలును తీసివేసేటప్పుడు ఫోన్ నీలం నుండి తెలుపు రంగులోకి మారడాన్ని చూడవచ్చు. వివో మాస్ ప్రొడక్షన్ కోసం ఎలెక్ట్రోక్రోమిక్ గ్లాస్ యొక్క ఈ కేసును అభివృద్ధి చేస్తుందా లేదా ఇది ఎలా వుంటుందో చూడటానికి ప్రస్తుతం దీనిని పరీక్షిస్తుందా అనే విషయం పైన మాత్రం ఇంకా స్పష్టత లేదు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :