Vivo T4R launched under rs 20000 segment phone
Vivo T4R: వివో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వివో టి4ఆర్ ఈరోజు ఇండియా మార్కెట్లో లాంచ్ అయ్యింది. వివో ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది, ఇప్పటికే స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విపరీతంగా పెరిగిన పోటీకి తట్టుకునే డిజైన్, ఫీచర్స్ మరియు స్పెక్స్ తో వివో ఈ ఫోన్ ను విడుదల చేసింది. మార్కెట్ లో సరికొత్తగా విడుదలైన ఈ వివో కొత్త ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందిస్తున్నాము.
వివో ఈ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ రూ. 19,499 ధరతో, మిడ్ వేరియంట్ (8 జీబీ + 256 జీబీ) రూ. 21,499 ధరతో మరియు ఈ ఫోన్ హై ఎండ్ (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ ను రూ. 23,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో అధికారిక వెబ్సైట్ నుంచి లభిస్తుంది.
వివో ఈ ఫోన్ ను ఆకట్టుకునే లాంచ్ ఆఫర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పై రూ. 2,000 HDFC మరియు Axis కార్డ్స్ బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 2,000 రూపాయల ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్లు అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే అందుకునే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,499 ధరలో లభిస్తుంది.
వివో టి4ఆర్ స్మార్ట్ ఫోన్ ట్రెండీ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.77 ఇంచ్ క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 లోకల్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G ఆక్టాకోర్ ప్రోసెసర్ తో ఏపీని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో జతగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
టి4ఆర్ స్మార్ట్ ఫోన్ 32 MP సెల్ఫీ కెమెరా మరియు వెనుక 50MP సోనీ మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా AI కెమెరా ఎడిటింగ్ ఫీచర్ మరియు 4K వీడియో షూట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను 5700 mAh బిగ్ బ్యాటరీతో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ 44 W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: లేటెస్ట్ Philips 4K QLED Smart Tv పై అమెజాన్ GFF Sale బిగ్ డీల్ అందుకోండి.!
ఈ వివో స్మార్ట్ ఫోన్ ఆర్క్టిక్ వైట్ మరియు ట్విలైట్ బ్లూ రెండు రంగులో లభిస్తుంది మరియు 7.39mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది. ఈ ఫోన్ IP68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో ఉంటుంది.