vivo T4R 5G first sale starts with huge discount offers
వివో కొత్తగా విడుదల చేసిన vivo T4R 5G స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. గత వారం విడుదలైన ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ ను బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ కొత్త ఫోన్ పై వివో మరియు ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ మరియు ఆఫర్స్ తెలుసుకుందామా.
వివో టి4 ఆర్ స్మార్ట్ ఫోన్ రూ. 19,499 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ పై లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 2,000 ఎక్స్ చేంజ్ ఆఫర్ మరియు రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్లతో ఒకసారి ఒక ఆఫర్ మాత్రమే అందుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 17,499 రూపాయల ఆఫర్ ధరకే మీకు లభిస్తుంది.
ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై ఈ డీల్ అందించింది. ఈ ఫోన్ ను Axis, HDFC మరియు ICICI మూడు బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. చేంజ్ బోనస్ కోసం మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఫోన్ ధరలో బడ్జెట్ స్టన్నింగ్ ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో కర్వుడ్ డిస్ప్లే మొదలుకొని గొప్ప కెమెరాలు మరియు డిజైన్ వరకు ఈ ఫోన్ గొప్పగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ సపోర్ట్ తో సినిమాలు మరియు వీడియోలు గొప్ప కలర్స్ తో అందిస్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్ తో మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 5G చిప్ సెట్, 8 GB ర్యామ్ మరియు 128 GB ర్యామ్ తో వస్తుంది. ఈ ఫోన్ హై ఎండ్ 256GB వేరియంట్ తో వస్తుంది. ఇది TSMC 4 nm ప్రోసెసర్ మరియు మల్టీ టాస్కింగ్ మరియు గేమింగ్ ను మంచిగా నిర్వహిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది.
ఈ వివో ఫోన్ వెనుక 50MP (Sony OIS) మెయిన్ + 2MP బొకే సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా స్పెషాలిటీ ఏమిటంటే, ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో కూడా 4K వీడియో రికార్డ్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్లు మరియు మరిన్ని కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.
Also Read: Instagram యూజర్లకు చేదు వార్త.. ఇక నుంచి వారికి Live స్ట్రీమ్ అవకాశం ఉండదు.!
వివో టి4R స్మార్ట్ ఫోన్ ఈ బడ్జెట్ ధరలో ఇతర ఫోన్లకు పోటీనిచ్చే IP68 + IP69 రేటింగ్ తో బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లో 5700 mAh బిగ్ బ్యాటరీ మరియు 47W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఫోన్ స్పెక్స్ షీట్ ప్రకారం, ఈ ఫోన్ లభించే ఆఫర్ ధరలో బెస్ట్ ఫీచర్లు కలిగి ఉన్నట్లు చెప్పొచ్చు.