Vivo T4 Pro జబర్దస్త్ Sony కెమెరా సిస్టం తో లాంచ్ అవుతోంది.!

Updated on 23-Aug-2025
HIGHLIGHTS

Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది

వివో కొత్తగా అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ కెమెరా వివరాలు అందించింది

జబర్దస్త్ Sony కెమెరా సిస్టం తో లాంచ్ అవుతున్నట్లు వివో చెబుతోంది

Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజింగ్ లో భాగంగా వివో కొత్తగా అందించిన టీజర్ నుంచి ఈ ఫోన్ కెమెరా వివరాలు అందించింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జబర్దస్త్ Sony కెమెరా సిస్టం తో లాంచ్ అవుతున్నట్లు అర్ధం అవుతుంది. ఈ ఫోన్ యొక్క చిప్ సెట్ మరియు ఫస్ట్ లుక్ సైతం వివో ముందే అందించింది.

Vivo T4 Pro కెమెరా సెటప్ ఏమిటి?

వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరా సెటప్ లో ప్రీమియం కెమెరాలు అందించింది. ఇందులో, OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా, 3x పెరిస్కోప్ 50MP Sony కెమెరా మరియు మరో కెమెరా ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కెమెరా కూడా అందించింది. ఈ ఫోన్ చాలా దూరం నుంచి కూడా మంచి ఫోటోలు చిత్రించే సత్తా కలిగి ఉంటుందని వివో తెలిపింది. ఈ ఫోన్ మంచి ఫోటోలు మరియు వీడియోలు కూడా అందిస్తుందని వివో గొప్పగా చెబుతోంది.

Vivo T4 Pro ఇతర స్పెక్స్ ఏమిటి?

వివో టి 4 ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ చిప్ సెట్ 1 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu అందిస్తుందని కూడా వివో తెలిపింది. ఈ ఫోన్ ప్రోసెసర్ వివరాలు వివో స్వయంగా వెల్లడించింది. ఈ ఫోన్ క్వాడ్ కర్వుడ్ డిస్ప్లే కలిగి ఉన్నట్లు టీజర్ ఇమేజ్ ద్వారా బయటకు వెల్లడయ్యింది.

ఈ ఫోన్ కలిగిన మరో ఫీచర్స్ గురించి కూడా వివో వెల్లడించింది. అదేమిటంటే, ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ IP68 మరియు IP68 కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ వెట్ హ్యాండ్ టచ్ మరియు గ్రీసీ హ్యాండ్ టచ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ స్లీక్ దిన తో ఉంటుందని అర్థం అవుతుంది.

Also Read: కొత్త Dial Pad నచ్చడం లేదా.. పాత డయల్ ప్యాడ్ ఇలా సెట్ చేసుకోండి.!

ఈ ఫోన్ యొక్క మరిన్ని అప్డేట్స్ కూడా వివో తర్వలోనే వెల్లడిస్తుంది. అయితే, ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన గొప్ప డిస్ప్లే, 6500 mAh హెవీ బ్యాటరీ మరియు 90W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ కూడా కలిగి ఉండవచ్చని అంచనా వేసి చెబుతున్నారు. ఈ ఫోన్ ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా కంపెనీ ముందే అప్ అందించే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :