vivo T4 Pro 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్దమైన వివో కొత్త ఫోన్.!

Updated on 28-Aug-2025
HIGHLIGHTS

vivo T4 Pro 5G మొదటి సేల్ రేపు జరగనున్నది

ఈ స్మార్ట్ ఫోన్ వివో టి సిరీస్ లో ప్రీమియం అండ్ హై ఎండ్ వేరియంట్ గా వచ్చింది

మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము

vivo T4 Pro 5G: వివో లేటెస్ట్ గా విడుదల చేసిన కొత్త ఫోన్ వివో టి4 ప్రో మొదటి సేల్ రేపు జరగనున్నది. ఈ స్మార్ట్ ఫోన్ వివో టి సిరీస్ లో ప్రీమియం అండ్ హై ఎండ్ వేరియంట్ గా వచ్చింది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టు ప్రో ఫీచర్స్ మరియు స్పెక్స్ కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ ఫోన్ సేల్ కంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అందించాము.

vivo T4 Pro 5G: ప్రైస్ అండ్ ఆఫర్స్

ఈ ఫోన్ మూడు వేరియంట్స్ లో విడుదల అయ్యింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఈ క్రింద చూడవచ్చు. ఈ ఫోన్ బ్లేజ్ గోల్డ్ మరియు నైట్రో బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది.

వివో టి4 ప్రో (8 జీబీ + 128 జీబీ) ధర : రూ. 27,999

వివో టి4 ప్రో (8 జీబీ + 256 జీబీ) ధర : రూ. 29,999

వివో టి4 ప్రో (12 జీబీ + 256 జీబీ) ధర : రూ. 31,999

ఈ ఫోన్ ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ Flipkart నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు కూడా వివో అందించింది.

ఆఫర్స్ :

ఈ వివో ఫోన్ మూడు వేరియంట్స్ పైన వివో రూ. 3,000 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. HDFC, SBI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ డిస్కౌంట్ అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ కేవలం రూ. 24,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ కేవలం ఫస్ట్ సేల్ ఒక్కరోజు మాత్రమే లభిస్తుంది.

Also Read: Google DATA Leak: 250 కోట్ల జీమెయిల్ యూజర్ల డేటా లీక్ తో కొత్త స్కామ్ లకు తెరలేచే అవకాశం.!

vivo T4 Pro 5G: ఫీచర్స్

వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ క్వాడ్ కర్వుడ్ స్క్రీన్ ను HDR 10+ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 12 జీబీ ర్యామ్ తో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.53mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది.

ఈ వివో ఫోన్ 50MP (Sony) + 2MP + 50MP (Sony) ట్రిపుల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా 4K వీడియో రికార్డింగ్, పెరిస్కోప్ సెన్సార్ తో గొప్ప జూమ్ మరియు మంచి AI ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 6500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ వివో ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :