బ్యాంక్ ఆఫర్లతో Vivo T2 5G సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది.!

HIGHLIGHTS

Vivo T2 5G సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది

Vivo T2 5G ఈరోజు మొదటిసారి సేల్ కి అంధుబాటులోకి వచ్చింది

బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తున్న వివో టి2 5జి

బ్యాంక్ ఆఫర్లతో Vivo T2 5G సేల్ ఈరోజు నుండి మొదలయ్యింది.!

వివో యొక్క లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ Vivo T2 5G సేల్ ఈరోజు నుండి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో మొదలయ్యింది. వివో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ ఈరోజు మొదటిసారి సేల్ కి అంధుబాటులోకి వచ్చింది. ఈ వివో లేటెస్ట్ 5G ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరియు బ్యాంక్ ఆఫర్లను గురించి వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T2 5G: ధర&ఆఫర్స్ 

ఈరోజు నుండి సేల్ కి అంధుబాటులోకి వచ్చిన Vivo T2 5G స్మార్ట్ ఫోన్ పైన కంపెనీ మంచి బ్యాంక్ ఆఫర్లను జతచేసింది. ICICI, HDFC మరియు SBI బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ వారికి 1,500 రూపాయల భారీ తగ్గింపు లభిస్తుంది మరియు SBI బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI పైన ఈ ఫోన్ కొనేవారికి కూడా ఈ అఫర్ వర్తిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు వివో ఆన్లైన్ స్టోర్ నుండి లభిస్తోంది.

వివో టి2 5జి ఫోన్ రెండు వేరియంట్ లలో లభిస్తుంది. వాటి ధర వివరాలను క్రింద చూడవచ్చు. 

1. Vivo T2 5G బేసిక్ వేరియంట్ (6GB + 128GB) ధర రూ. 18,999

2. Vivo T2 5G హై ఎండ్ వేరియంట్ (8GB + 128GB) ధర రూ. 20,999

Vivo T2 5G: ప్రత్యేకతలు

వివో టి2 5జి ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చింది మరియు 7.8mm తో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించ గల 6.38 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే, OIS సపోర్ట్ కలిగిన 64MP డ్యూయల్ రియర్ కెమేరా సెటప్, 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4500 mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 695 SoC మరియు 8GB ఎక్స్ టెండ్ ర్యామ్ వంటి ఫీచర్లను కలిగివుంది.

ఈ వివో ఫోన్ లేటెస్ట్ Funtouch OS 13 సాఫ్ట్ వేర్ తో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ నైట్రో బ్లేజ్ మరియు వెలాసిటీ వేవ్ రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile