వివో ఈరోజు Vivo T1X ను 50MP డ్యూయల్ కెమెరాతో బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ టెండేడ్ ర్యామ్ 2.0, సమర్ధవంతమైన పెద్ద బ్యాటరీ మరియు హై ఎండ్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఆకర్షణీయమైన ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ముఖ్యంగా, ఈ ఫోన్ ను ఎప్పుడూ చల్లగా ఉంచేందుకు వీలుగా 4 లేయర్ కూలింగ్ సిస్టం అందించినట్లు వివో తెలిపింది. ఈ లేటెస్ట్ వివో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందామా.
వివో టి1X స్మార్ట్ ఫోన్ యొక్క స్టార్టింగ్ వేరియంట్ ధర రూ.11,999 మరియు ఇది 4GB ర్యామ్/64GB స్టోరేజ్ తో వస్తుంది. అయితే, ఇందులోనే 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అలాగే, మరొక వేరియంట్ ధర రూ.14,999 మరియు ఇది 6GB ర్యామ్/128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 27 నుండి Flipkart, Vivo అధికారిక వెబ్ సైట్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
వివో T1X స్మార్ట్ ఫోన్ 6.58 ఇంచ్ FHD+ LCD డిస్ప్లేని కలిగివుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ తో పాటుగా 2GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. అంతేగాదు, మైక్రో SD కార్డు ద్వారా మెమోరిని మరింతగా విస్తరించవచ్చు.
ఇక కెమెరాల విభాగంలో, వివో T1X ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో, 50MP ప్రధాన కెమెరా మరియు జతగా 2MP డెప్త్ వున్నాయి. అలాగే, సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారితమైన Funtouch OS 12 స్కిన్ పైన నడుస్తుంది.