Vivo, Redmi and Realme new phones launching tomorrow
Vivo, Redmi మరియు Realme బ్రాండ్స్ నుంచి రేపు ఇండియాలో మూడు కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. వివో నుంచి వివో వి 70 FE స్మార్ట్ ఫోన్, రెడ్ మీ నుంచి రెడ్ మీ నోట్ 15 స్పెషల్ మరియు రియల్ మీ నుంచి రియల్ మీ 16 స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతాయి. ఈ మూడు ఫోన్లు కూడా రేపు మధ్యాహ్నం మార్కెట్ లో లాంచ్ అవుతాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ టైం మరియు ఈ ఫోన్స్ వివరాలు ఏమిటో ఒక లుక్కేద్దామా.
వీటిలో రెడ్ మీ నోట్ 15 ఫోన్ ముందుగా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ రేపు ఉదయం 11 గంటలకు లాంచ్ అవుతుంది. వివో వి 70 FE మరియు రియల్ మీ 16 రెండు స్మార్ట్ ఫోన్లు కోడోత్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతాయి.
రెడ్ మీ ఈ ఫోన్ ను లగ్జరీ వేగాన్ లెథర్ తో కేవలం 7.35 స్లీక్ డిజైన్ లో లాంచ్ చేస్తోంది. క్రిమ్సన్ రివర్స్ అనే కొత్త కాలర్ లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5800 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది.
ఇది వివో నుంచి లాంచ్ అవుతున్న మిడ్ రేంజ్ ఫోన్ మరియు మంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ కోసం తగిన బిగ్ 6.83 ఇంచ్ OLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ మరియు HDR సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఇవి కాకుండా ఈ ఫోన్ 200MP బిగ్ కెమెరా కూడా కలిగి ఉంటుంది.
Also Read: Zebronics 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ఈ రోజు ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!
ఈ ఫోన్ షైనీ గ్లీమింగ్ వింగ్ టెక్స్చర్ బ్యాక్ కలిగిన కొత్త ఎయిర్ డిజైన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 7000 mAh టైటాన్ బ్యాటరీ మరియు 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ IP69 రేటింగ్ తో లాంచ్ అవుతుంది మరియు 300% వాల్యూమ్ సౌండ్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కలిగి ఉంది.