Vivo X80 Series ను ఇండియాలో మే 19న విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ సిరీస్ నుండి వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు భారీ ప్రీమియం ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు వివో చెబుతోంది. ఈ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని కెమెరాలతో సహా గొప్ప స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగివున్నట్లు కంపెనీ ఇప్పటికే టీజింగ్ కూడా మొదలుపెట్టింది. మరి వచ్చే వారంలో విడుదల కాకానున్న ఈ వివో అప్ అకమింగ్ స్మార్ట్ ఫోన్లలో ఎంటువంటి ఫీచర్లు వున్నాయి మరియు ఎటువంటి ఫిచర్లను ఎక్స్ పెక్ట్ చేయవచునో చూద్దాం.
Vivo X80 సిరీస్ లో రెగ్యులర్ X80 మరియు X80 Pro మోడల్స్ ఉంటాయి. ముందుగా, వివో X80 తో మొదలుపెడితే ఈ ఫోన్ లో MEMC టెక్నాలజీతో 6.78-అంగుళాల E5 AMOLED డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ల డిస్ప్లేలో సెంట్రల్ పంచ్ హోల్ డిజైన్ తో మరియు అందులో 32MP కెమెరాతో ఉంటుంది. ఇక వెనుక కెమెరాలలో OIS తో 50MP సోనీ IMX866 ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రావైడ్ మరియు 12MP (2x, 20x సూపర్ జూమ్) టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. మీరు ఇందులో Zeiss ఆప్టిక్స్, Zeiss T* కోటింగ్ మరియు V1+ ISPని కూడా పొందుతారు.
ఈ ఫోన్లలో LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్‌తో MediaTek డైమెన్సిటీ 9000 పైన అందించబడుతుంది. ఫోన్ 80W వైర్డు ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీతో పనిచేస్తుంది.
ఇక X80 Pro మోడల్ విషయానికి వస్తే, ఇందులో 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన LTPO స్క్రీన్ తో వుంది. మీరు స్మార్ట్ ఫోన్ లో Qualcomm Snapdragon 8 Gen 1 లేదా MediaTek డైమెన్సిటీ 9000 వేరియంట్ లను ఎంచుకోవచ్చు. IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ మరియు స్క్రీన్ కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా ఇందులో పొందుతారు. ప్రో వేరియంట్ 80W వైర్డు ఛార్జింగ్ అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో మద్దతునిస్తుంది.