వివో తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది. Vivo T1 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఫిబ్రవరి 9 న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. Vivo భారతదేశంలో T1 Series అని పిలువబడే కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ లైనప్ గత సంవత్సరమే చైనాలో విడుదల చెయ్యబడింది. చైనాలో ఈ T సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. అయితే, వివో T1 సిరీస్ లో రెండవ ఫోన్‌ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందో లేదో వేచిచూడాలి.
ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ యోక్క టీజర్ ను వివో అధికారిక వెబ్సైట్ ద్వారా అందించింది. ఈ ఫోన్ ను Flipakrt కూడా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. అంటే ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుండి అమ్మకాలను సాగించవచ్చు. ఈ ఫోన్ యొక్క ఫీచర్లను ఫిబ్రవరి 3 వ తేదీ నుండి ఒక్కొక్కటిగా రివీల్ చేయనున్నట్లు కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది. అయితే, ప్రోసెసర్ గురించి మాత్రం ఈ టీజర్ లో కనిపిస్తోంది మరియు ఇది చైనా వేరియంట్ తో బిన్నంగా వుంది. ఇండియన్ వేరియంట్ స్నాప్ డ్రాగన్ 695 ప్రోసెసర్ తో కనిపిస్తోంది. చైనా వేరియంట్ లో మాత్రం స్నాప్ డ్రాగన్ 778 ప్రోసెసర్ ని అందించింది.
Vivo T1 5G చైనా వేరియంట్ 6.67 ఇంచ్ FHD+ LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. చైనా వేరియంట్ స్నాప్ డ్రాగన్ 778 చిప్ సెట్ తో వచ్చింది. అయితే, టీజర్ లో చూపించిన ప్రకారం ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC తో రావచ్చు.
ఇక కెమెరాల పరంగా, T1 లో 64MP ప్రధాన కెమెరా, 120-డిగ్రీ FOVతో కూడిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.