Vivo Y12s బడ్జెట్ ధరలో పెద్ద బ్యాటరీ బొకే కెమెరాతో విడుదల

Updated on 26-May-2023
HIGHLIGHTS

ఇండియాలో Vivo Y12s స్మార్ట్ ఫోన్ లాంచ్

Y12s Multi Turbo 3.0 తో గేమింగ్ మరింత స్మూత్ గా ఉండేలా చేస్తుంది

Y12s సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది.

వివో సంస్థ బడ్జెట్ యూజర్లను లక్ష్యంగా ఇండియాలో Vivo Y12s స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Y12s స్మార్ట్ ఫోన్ కేవలం 10,000 రుపాయల కంటే తక్కువ ధరలో పెద్ద బ్యాటరీ, పెద్ద స్క్రీన్ మరియు సెల్ఫీల కోసం సింగిల్ క్యామ్ బొకే సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో విడుదల వివో చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో వచ్చింది మరియు దీని ధర రూ.9,990.  

Vivo Y12s ప్రత్యేకతలు

Vivo Y12s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.51 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో P35 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు Multi Turbo 3.0 తో గేమింగ్ మరింత స్మూత్ గా ఉండేలా చేస్తుంది. ఈ చిప్సెట్ కి  జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. అలాగే, ఒక డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు. 

కెమెరా పరంగా, Y12s వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా 2MP డెప్త్ సెన్సార్ కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని సింగల్ కెమెరా బొకే ఎఫెక్ట్ తో అందించారు. ఈ ఫోన్, అన్లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీని కలిగి వుంది. Y12s  స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన Funtuch OS 11 స్కిన్ పైన పనిచేస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :