ఇండియాలో వివో Z1x యొక్క 8GB ర్యామ్ వేరియంట్ విడుదల చేసింది

Updated on 16-Oct-2019
HIGHLIGHTS

వివో జెడ్ 1 ఎక్స్ ఇప్పుడు మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇవ్వబడుతుంది.

వివో తన సరికొత్త జెడ్ 1 ఎక్స్ ఫోన్ యొక్క కొత్త వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. వివో జెడ్ 1 ఎక్స్ ఇప్పుడు 8 జీబీ ర్యామ్‌తో పరిచయం చేయబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ను మొదట 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ప్రవేశపెట్టారు. అయితే, వివో జెడ్ 1 ఎక్స్ ఇప్పుడు మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇవ్వబడుతుంది.

వివో జెడ్ 1 ఎక్స్ యొక్క 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ఫ్యూజన్ బ్లూ కలర్ రూ .21,990 ధరతో ప్రవేశపెట్టబడింది. దీనితో పాటుగా వివో దీపావళి పండుగ ఆఫర్లను కూడా ప్రకటించింది.  వినియోగదారులు HDFC మరియు ICICI బ్యాంక్ కార్డులపై 5 శాతం క్యాష్‌ బ్యాక్ పొందవచ్చు.

వివో Z1x ధర

1.  6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ – Rs.16,990/-

2.  6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.18,990/-

3. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ – Rs.18,990/-

వివో Z1x ధర  ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో Z1x మొబైల్ ఫోన్, ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌ లో, ఎగవంతమైనటువంటి ఒక స్నాప్ డ్రాగన్ 712 AIE ఆక్టా కోర్ ప్రాసెసర్ ని అందించింది. అదనంగా, ఇది 6GB/8GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 64GB /128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ మరియు గరిష్టంగా 22.5 వాట్స్ వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో, గేమింగ్ మరియు మల్టి టాస్కింగ్ కోసం ప్రత్యేకంగా మల్టి టర్బోలను అందించారు.

ఇక ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. ఒక 48MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో ఒక 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది. ఈ ఫోన్, ఫన్ టచ్ OS స్కిన్ పైన ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది. ఇది కేవలం 0.48 సెకన్లలో ఫోన్ అన్లాక్ చేయగల ఒక ఇన్- డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇది ఫ్యూజన్ బ్లూ మరియు ఫాంటమ్ పర్పల్ వంటి రెండు రంగుల ఎంపికలతో లభిస్తుంది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :