వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T1 5G ఇండియాలో ఫిబ్రవరి 9 న విడుదలకానుంది. వివో ఈరోజు నుండి ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 695 5G ప్రోసెసర్ తో తీసుకువస్తున్నట్లుగా ఈరోజు ఒక మెయిన్ ఫిచర్ రివీల్ చేసింది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ యోక్క టీజర్ ను వివో అధికారిక వెబ్సైట్ ద్వారా అందించింది.
అయితే, గత సంవత్సరం చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ చైనా వేరియంట్ స్నాప్ డ్రాగన్ 778 ప్రోసెసర్ తో ఉంటే, ఇండియన్ వేరియంట్ మాత్రం స్నాప్ డ్రాగన్ 695 ప్రోసెసర్ తో వస్తోంది. రానున్న రోజుల్లో డిస్ప్లే, కెమెరా మరియు మరిన్ని కీలకమైన ఫీచర్లను వెల్లడించనుంది.
Vivo T1 5G చైనా వేరియంట్ 6.67 ఇంచ్ FHD+ LCD డిస్ప్లే ని కలిగివుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా కోసం పంచ్ హోల్ కటౌట్ ఉంది. ఈరోజు కంపెనీ తెలిపిన ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC తో వస్తోంది.
ఇక కెమెరాల పరంగా, T1 లో 64MP ప్రధాన కెమెరా, 120-డిగ్రీ FOVతో కూడిన 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.