vivo announced Vivo V70 and V70 Elite launch in India
వివో 70 సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసున్నట్లు వివో అనౌన్స్ చేసింది. Vivo V70 మరియు V70 Elite రెండు స్మార్ట్ ఫోన్స్ ఈ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం వివో టీజింగ్ స్టార్ట్ చేయడమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కలిగిన కీలకమైన ఫీచర్ ను కూడా లాంచ్ టీజర్ లో భాగంగా రివీల్ చేసింది.
వివో 70 మరియు వివో 70 ఎలీట్ స్మార్ట్ ఫోన్ కోసం కేవలం టీజర్ మ్యాట్రీమ్ విడుదల చేసింది. ఈ టీజర్ లో ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ఎటువంటి డేట్ ఇవ్వలేదు. ఈ సిరీస్ ను త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు మాత్రం ప్రకటించింది.
Vivo V70 మరియు V70 Elite స్మార్ట్ ఫోన్ లను కూడా ZEISS ఆప్టిక్స్ తో అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లను క్వాల్కమ్ Snapdragon 8s Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా వివో అనౌన్స్ చేసింది. ఈ లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ తో జతగా LPDDR5X ర్యామ్ మరియు UFS 4.1 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్స్ చాలా స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో వస్తున్నట్లు ఈ ఫోన్స్ గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్స్ ను ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ తో తయారు చేసినట్లు వివో కన్ఫర్మ్ చేసింది.
ఈ సిరీస్ ఫోన్స్ సరికొత్త కెమెరా సెటప్ ఉన్నట్లు కూడా చూపించింది. ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా మరియు జతగా Aura రింగ్ లైట్ ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP ZEISS మెయిన్ సెన్సార్, 50MP ZEISS నైట్ టెలిఫోటో మరియు ZEISS అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 50MP గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 60FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Wobble ఇండియన్ మార్కెట్లో 9 కొత్త బడ్జెట్ Smart Tv లు విడుదల చేసింది.!
ఇక వివో వి70 స్మార్ట్ ఫోన్ కలిగిన బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ మరియు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 1.5K రిజల్యూషన్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు చాలా నారో బెజెల్స్ కలిగిన OLED స్క్రీన్ ఈ ఫోన్ లో ఉంటుంది.