Upcoming: 2022 అప్ కమింగ్ మొబైల్స్ గురించి తెలుసుకోండి.!

Updated on 14-Nov-2022
HIGHLIGHTS

అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్స్ 2022

మార్కెట్ లో అడుగుపెట్టనున్న స్మార్ట్ ఫోన్ల వివరాలు

2022 అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లిస్ట్

త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల గురించి ఈరోజు చర్చించనున్నాము. ఈ నెల మార్కెట్ లోకి భారీ ఫీచర్లు కలిగిన చాలా స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందుకే, మార్కెట్ లో అడుగుపెట్టనున్న స్మార్ట్ ఫోన్ల వివరాలను మనం ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరింకెదుకు ఆలశ్యం 2022 అప్ కమింగ్ మొబైల్స్ గురించి తెలుసుకోండి.

Samsung Galaxy S23 Ultra

ప్రస్తుత నివేదికల ప్రకారం, శామ్సంగ్ తన పవర్ ఫుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S23 Ultra ను మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా వివరాలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, ఈ అప్ కమింగ్ శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 7 తో పడుతుందనే వార్త ఘాటుగా వినిపిస్తోంది.

Google Pixel 7a

గూగుల్ పిక్సెల్ 7ఎ భారీ ఫీచర్లతో వస్తున్నట్లు పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ నివేదికలను పరిగణలోకి తీసుకున్నట్లయితే, గూగుల్ పిక్సెల్ 7ఎ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ని కలిగి వుంటుంది. ఈ ఫోన్ భారీ Sony బ్రాండ్ కెమెరాలతో వస్తుందని కొత్త రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఈ గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Realme 10 Pro+

Realme 10 Pro+ ఇప్పటికే చాలా టీజర్ ద్వారా కనిపించింది. ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ మరియు పెద్దగా కనిపించేలా ఉన్న కెమెరా లతో దర్శనమిచ్చింది. Dimensity 1080 పవర్ ఫుల్ చిప్ సెట్, FHD+ రిజల్యూషన్ కలిగిన కర్వ్డ్ డిస్ప్లేని కల్గి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Vivo X90 Pro+

వివో ఫ్లాగ్ షిప్ సిరీస్  X90 Seris నుండి స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతోంది. ఇప్పటికే లీకైన ప్రమోషన్ వీడియో ద్వారా కీలకమైన స్పెక్స్ బయటికి వచ్చాయి. దీనిద్వారా, ఈ ఫోన్ 2K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల Samsung AMOLED E6 ప్యానెల్ తో వస్తుంది. Vivo X90 Pro+ సోనీ IMX989V 50MP 1-ఇంచ్ ప్రైమరీ సెన్సార్‌తో సహా 50MP క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. టెలిఫోటో కెమెరా కోసం 64MP ఓమ్నివిజన్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ మరియు మెరుగైన లో-లైట్ ఫోటోల కోసం మూడు-దశల ఎక్స్‌పోజర్ HDR ఫోటోగ్రఫీతో స్మార్ట్‌ఫోన్ కూడా రావచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :