బెస్ట్ 5 మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లు : రూ. 15,000 కంటే తక్కువ ధరలో

Updated on 13-Mar-2019
HIGHLIGHTS

లేటెస్ట్ మరియు ట్రెండీ స్మార్ట్ ఫోన్ల యొక్క జాబితా అందుకోండి.

ప్రస్తుతం మార్కెట్లో 15,000 రుపాయల ధరలో ఎంచుకోవడానికి చాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి పర్ఫార్మెన్స్ మరియు డిజైన్, ఇంకా కెమేరా అన్నింటి కలయికగా చూస్తే మాత్రం కొన్ని ఫోన్లు మాత్రమే లిస్టులో నిలుస్తాయి. కాబట్టి ఇటువంటి అన్ని వివరాలను కలిగి వున్నా స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా, ఈ జాబితాలో అందించిన స్మార్ట్ ఫోనాలన్నీ కూడా మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫోన్ పర్ఫార్మెన్స్ అందిస్తాయని ఖఛ్చితంగా చెప్పొచ్చు.           

1. షావోమి రెడ్మి నోట్ 7 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్ను షావోమి సరికొత్తగా ఇండియాలో విడుదల చేసింది మరియు ఇది గణనీయమైన అమ్మకాలు కూడా మొదలయ్యాయి. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది షావోమి సంస్థ. ఇది ప్రధానంగా వేనుక 48MP + 5MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 13MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.  ఇది ముందు మరియు వెనుక కూడా ఒక కొర్ణింగ్ గోరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఇది డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ తో ఒక 19.5:9 యాస్పెక్ట్ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు అందించగల ఒక 6.3-అంగుళాల FHD +డిస్ప్లే తో వస్తుంది. అలాగే, ఇది స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో మంచి పెరఫార్మెన్సు ఇస్తుంది.     

2. శామ్సంగ్ గెలాక్సీ M30 

 శామ్సంగ్ గెలాక్సీ M30 స్మార్ట్ ఫోన్ను శామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ నుండి సరికొత్తగా ఇండియాలో విడుదల చేసింది మరియు ఇది మంచి అమ్మకాలను కూడా సాధించింది. శామ్సంగ్, ఈ ఫోన్ను అద్భుతమైన డిస్ప్లేతో అందించింది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.4-అంగుళాల FHD + సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేనుక 13MP + 5MP + 5MP  ట్రిపుల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

3. మోటో వన్ పవర్    

ఈ మోటో వన్ పవర్ స్మార్ట్ ఫోన్ ఇప్పటివరకు ఆల్ టైం బెస్ట్ ఫోనుగా చెప్పొచ్చు. ఇది నిలకడగా దాని అమ్మకాలను కొనసాగిస్తోంది. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది మోటో. ఇది ఒక సాధారణ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.2 -అంగుళాల FHD + స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేనుక 16MP + 5MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 12MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.అలాగే, ఇది స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో మంచి పెరఫార్మెన్సు ఇస్తుంది మరియు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది.      

4. అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2        

ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 స్మార్ట్ ఫోన్ను అసూస్ గతసంవత్సరం ఇండియాలో విడుదల చేసింది మరియు ఇది గొప్ప అమ్మకాలను కూడా సాధించింది. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది అసూస్. ఇది ఒక సాధారణ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.26 -అంగుళాల FHD + స్క్రీన్ కలిగి ఉంటుంది. వేనుక 12MP + 5MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 13MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు. ఈ ఫోన్ యొక్క 6GB ర్యామ్ కళ్ళు చెదిరే పెరఫార్మెన్సు అందిస్తుంది.   

5. హానర్ 8X  

ఈ హానర్ 8X స్మార్ట్ ఫోన్ను హానర్ గతసంవత్సరం ఇండియాలో విడుదల చేసింది హానర్ సంస్థ. ఇది విడుదలైనప్పటినుండి గొప్ప అమ్మకాలను కూడా సాధించింది. ఈ ఫోన్ను మంచి డిజైన్ మరియు స్పెక్స్ తో అందించింది హానర్. ఇది ఒక సాధారణ నోచ్ రూపకల్పనతో గల ఒక 6.5 -అంగుళాల FHD + డిస్ప్లే కలిగి ఉంటుంది. వేనుక 20MP + 2MP డ్యూయల్ కెమేరా సెటప్ తో పాటుగా ముందు 16MP సెల్ఫీ కెమేరాని ఇందులో అందించారు.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :