POCO F2 Pro ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

Updated on 12-May-2020
HIGHLIGHTS

లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.

పోకో ఎఫ్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ను ఈ రోజు, అనగా మే 12 న ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ ఈవెంట్‌ ద్వారా విడుదలకానుంది. Poco F1 యొక్క నెక్స్ట్ జెనరేషన్ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారికి, ఈరోజుతో ఈఫోన్ గురించిన అన్ని రూమర్లకు తెరపడనుంది. పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ ఈవెంట్ మే 12 న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ రోజు పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్: దీన్ని ప్రత్యక్షంగా చూడటం ఎలా

పోకో ఎఫ్ 2 ప్రో లాంచ్ ఈవెంట్ మే 12 న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానుంది, దీని Livestream ఫేస్‌బుక్, యూట్యూబ్ మరియు ట్విట్టర్‌లో ప్రసారం అవుతుంది. ఈ క్రింద వీడియో లింక్‌ తో నేరుగా చూడవచ్చు.

పోకో ఎఫ్ 2 ప్రో  : అంచనా వేసిన ప్రత్యేకతలు

పోకో ఎఫ్ 2 ప్రో ఒక 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డి + డిస్‌ప్లే తో మెటల్-గ్లాస్ నిర్మాణాన్ని సూపర్ అమోలెడ్ ప్యానల్‌ను ఉపయోగిస్తుందని ఇప్పటికే రూమర్లు వున్నాయి. గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో మరియు HDR10 + ప్లేబ్యాక్‌ మద్దతుతో రావచ్చు.

ఈ ఫోన్‌ను క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్ ఆక్టా-కోర్ సిపియు మరియు అడ్రినో 650 జిపియుతో నడుస్తుందని భావిస్తున్నారు. ఇది 8GB RAM మరియు 256GB స్టోరేజి ఎంపికలతో జత చేయవచ్చు. ఇది Android 11 ఆధారంగా పోకో లాంచర్‌ తో MIUI 11 లో ఉత్తమంగా ఉండవచ్చు.

కెమెరాల విషయానికొస్తే, పోకో ఎఫ్ 2 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్, ప్రాధమిక 64 ఎంపి కెమెరా, 5 ఎంపి టెలిఫోటో లెన్స్, మాక్రో కెమెరా, 13 ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉండవచ్చు. ముందు వైపు, మోటరైజ్డ్ పాప్-అప్ మాడ్యూల్‌లో ఉంచబడిన 20MP సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఎఫ్ 2 ప్రో 4,700 ఎంఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జ్ 4+ మరియు పవర్ డెలివరీకి తోడ్పడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :