ఈరోజు భారీ అఫర్ తో Infinix Hot 10s ఫస్ట్ సేల్

HIGHLIGHTS

Infinix Hot 10s ఫస్ట్ సేల్ ఈరోజు జరుగనుంది

ఈరోజు Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ కొనేవారికి భారీ ఆఫర్

ఇటీవల ఇంఫినిక్స్ ఇండియాలో లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix Hot 10s ఫస్ట్ సేల్ ఈరోజు జరుగనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. అయితే, మొదటి రోజు సేల్ నుండి ఈ Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ కొనేవారికి భారీ ఆఫర్ ని కూడా ప్రకటించింది. ఈ అఫర్ తో 500 రూపాయల డిస్కౌంట్ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చెయ్యవచ్చు. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలను ఈ క్రింద చూడవచ్చు.                 

Infinix Hot 10s : ధర

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్ లలో ప్రకటించింది. వీటిలో, Infinix Hot 10s  (4జీబీ + 64 జీబీ ) స్టార్టింగ్ వేరియంట్ ను రూ.9,999 ధరతో, మరియు (6జీబీ + 64 జీబీ ) వేరియంట్ ను రూ.10,999 ధరతో ప్రవేశపెట్టింది. 

Infinix Hot 10s : ప్రత్యేకతలు

Infinix Hot 10s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 -అంగుళాల HD + రిజల్యూషన్ గల డిస్ప్లే తో వుంటుంది మరియు ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శ్యాంప్లింగ్ రేట్ గల డిస్ప్లే. ఇది 90.6% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది మరియు NEG Dinorex  గ్లాస్ ప్రొటక్షన్ తో పైన చిన్న నోచ్ డిజైన్ ని అందించింది.

ఈ ఫోన్ మీడియా టెక్  హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది మరియు ఇది ఆక్టా-కోర్ CPU. ఇది 6GB RAM మరియు 64GB స్టోరేజ్ ఎంపికతో జత చేయబడుతుంది. ఇది COD, PUBG, Free Fire వంటి గేమ్స్ ని కూడా చక్కగా నిర్వహించగలదు. అలాగే, ఇది XOS  7.6 ఆధారితంగా ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది.

ఇక కెమెరాల విషయంలో, ఈ ఇన్ఫినిక్స్ హాట్ 10s వెనుక భాగంలో ట్రిపుల్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో, ప్రధాన కెమెరాని 48MP సెన్సార్ తో అందించింది. దీనికి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు AI లెన్స్ కెమెరాలను జతచేసింది. ముందు భాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ పెద్ద 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంటుంది.  ఆడియో పరంగా కూడా ఇందులో DTS Surround సౌండ్ ని కూడా అందించింది. ఓవరాల్ గా చెప్పాలంటే తక్కువ ధరలో మంచి ఫోన్ అందుకోవచ్చు.                         

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :