ధమాకా అఫర్: హాఫ్ రేటుకే Redmi ఫోన్లు..డోంట్ మిస్ ది ఛాన్స్.!

HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి సూపర్ అఫర్ అందుబాటులో వుంది

షియోమీ క్లియరెన్స్ సేల్ నుండి మీ కలను నిజం చేసుకోవచ్చు

రూ.3,999 రూపాయలకే Redmi 6A స్మార్ట్ ఫోన్

సెకెండ్ హ్యాండ్ ఫోన్ ధరకే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి సూపర్ అఫర్ అందుబాటులో వుంది. షియోమీ రీసెంట్ గా ప్రకటించిన షియోమీ క్లియరెన్స్ సేల్ నుండి మీ కలను నిజం చేసుకోవచ్చు. ఎందుకంటే, కొన్ని బెస్ట్ పాత మోడల్ స్మార్ట్ ఫోన్లను కేవలం హాఫ్ రేటుకే సేల్ చేస్తోంది. మోడల్స్ పాతవే అయినా ఫోన్లు మాత్రం కొత్తవి అని గుర్తుంచుకోండి. వీటిలో కొన్ని ఫోన్లు భారీ ఫీచర్లను కలిగి ఉంటాయి. కానీ, ధర మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మరి షావోమి అతి చవకగా అమ్ముడు చేస్తున్న ఆ స్మార్ట్ ఫోన్ల వివరాలను పరిశీలిద్దామా.

షియోమీ సగం ధరకే అఫర్ చేస్తున్న ఫోన్లలో Redmi 6A, Redmi Y3 మరియు Redmi Note 7 Pro వంటి బెస్ట్ ఫోన్లు ఉన్నాయి. వీటిలో, రెడ్ మీ నోట్ 7 ప్రో ఇండియాలో మొట్టమొదటి 48ఎంపీ Sony IMX586 సెన్సార్ కలిగిన స్మార్ట్ ఫోన్. రూ.10,999 రూపాయల ధరలో వచ్చిన ఈ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ.5,999 అఫర్ ధరకే మీరు పొందవచ్చు.

కేవలం Redmi Note 7 Pro స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు Redmi 6A స్మార్ట్ ఫోన్ కూడా సగం ధరకే లభిస్తోంది. ముందుగా, రూ.6,999 రూపాయలకు లభించిన ఈ ఫోన్ ఇప్పుడు షియోమీ క్లియరెన్స్ సేల్ నుండి రూ.3,999 రూపాయలకే సేల్ చేస్తోంది. మరింకెదుకు ఆలశ్యం మీరు కూడా చావా దరకే మంచి కొనాలనుకుంటే mi.com వెబ్సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు లేదా ఇక్కడ అందించిన Click Here to Check offer పైన క్లిక్ చేసి అఫర్ ను చెక్ చేయవచ్చు.

Redmi Note 7 Pro: స్పెక్స్

ఈ రెడ్మి నోట్ 7 ప్రో, డిస్ప్లే పైన వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో పెద్ద 6.3 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ కూడా 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణలో ఉంచబడింది మరియు బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క ముందు మరియు వెనుకభాగంలో 5th జెనరేషన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని కలిగి వుంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజి లలో లభిస్తుంది. ఈ ఫోన్ 4,000 mAh బ్యాటరీతో వస్తుంది.

రెడ్మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్,  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP సెకండరీ సెన్సారుతో జతగా కలిపిన 48MP సెన్సారు కలిగి ఉంటుంది. ఈ నోట్ 7 ప్రో యొక్క 48MP కెమేరా Sony IMX586 సెన్సార్ తో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది.  ఈ Redmi Note 7 Pro, పోస్టర్ వంటి HD ఫోటోలను తీయగలదు. ఈ కెమెరాతో తీసే ఫొటోలు అత్యధికంగా 15MP పరిమాణం వరకూ ఉంటాయి.  ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 13MP కెమెరా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :