అమెజాన్ సేల్ నుండి Redmi Note 9 అతితక్కువ ధరకే లభిస్తోంది

HIGHLIGHTS

Redmi Note 9 కేవలం రూ.10,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తోంది.

HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు.

మీరు డబుల్ బెనిఫిట్ పొందవచ్చు.

ఇటీవల, భారతదేశంలో మంచి ఫీచర్లతో Redmi Note 9 లాంచ్ చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద FHD+ స్క్రీన్, గేమింగ్ ప్రాసెసర్ మరియు 48MP క్వాడ్ కెమెరా సెటప్ వంటి ట్రెండీ ఫీచర్లతో వచ్చింది. ఇన్ని మంచి ఫీచర్లతో వచ్చిన ఈ Redmi Note 9  కేవలం రూ.11,999 రూపాయల ధరకు లాంచ్ చెయ్యగా, ఇప్పుడు అమెజాన్ సేల్ నుండి 1,000 డిస్కౌంట్ అందుకొని కేవలం రూ.10,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా, HDFC కార్డుతో కొనుగోలు చేస్తే, 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. అంటే, మీరు డబుల్ బెనిఫిట్  పొందవచ్చు.               

Redmi Note 9 అఫర్ ధరలు

Redmi Note 9 అఫర్ ధరల విషయానికి వస్తే, రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ ఫోన్ 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అమెజాన్ నుండి వీటి అఫర్ ధరలు వరుసగా రూ .10,999, రూ .12,499, రూ .13,999 . ఈ Redmi Note 9 ఆక్వా గ్రీన్, ఆర్కిటిక్ వైట్ మరియు పెబుల్ గ్రే కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.

Redmi Note 9 స్పెసిఫికేషన్

షియోమి రెడ్ మీ నోట్ 9 ఒక 6.53-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లేను 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోన్ స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 మరియు మెరుగైన పనితీరు కోసం మీడియాటెక్ Helio G 85 ప్రాసెసర్‌ సపోర్ట్ తో వస్తుంది. అదే సమయంలో, ఈ స్మార్ట్ ‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారితమైన MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ ‌లో పనిచేస్తుంది.

Redmi Note 9 కెమేరా

కెమెరా గురించి మాట్లాడితే, వినియోగదారులకు రెడ్ మీ నోట్ 9 స్మార్ట్‌ ఫోన్ ‌లో క్వాడ్ కెమెరా సెటప్ లభిస్తుంది. ఇందులో, 48 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ ISOCELL సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్-లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2 మెగాపిక్సెల్ వంటి కెమేరాలు ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Redmi Note 9 బ్యాటరీ

కనెక్టివిటీ కోసం రెడ్ మీ నోట్ 9 లో 4 జి వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ వెర్షన్ 5.0, జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్ ‌ఫోన్ జాక్ మరియు యుఎస్‌బి పోర్ట్ టైప్-సి ఉన్నాయి. అదనంగా, వినియోగదారులు ఈ రెడ్ మీ నోట్ 9 లో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీని పొందుతారు, ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :