Realme కొత్త సిరీస్ Narzo 20 నుండి 3 కొత్త స్మార్ట్ ఫోన్స్ భారత మార్కెట్లో విడుదలయ్యాయి. Narzo 20 సిరీస్ లో, నార్జో 20 ప్రో మంచి ఫీచర్లతో వచ్చింది. కేవలం రూ. 14,999 రూపాయల అతక్కువ ధరలో అత్యంత వేగవంతమైన 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చిన ఏకైక ఫోనుగా ఇది నిలుస్తుంది. అలాగే, ఆకర్షణీయమైన సరికొత్త డిజైన్, వేగవంతమైన ప్రాసెసర్ తో పాటుగా మరిన్ని గొప్ప ఫీచర్లను తీసుకొస్తుంది.
రియల్ మీ నార్జో 20 ధర 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ రూ .14,999 ధరతో మరియు 8GB ర్యామ్ 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ను రూ .16,999 ధరతో ప్రకటించింది . ఈ స్మార్ ఫోన్ బ్లాక్ నింజా మరియు వైట్ నైట్ అనే రెండు రంగులలో లభిస్తుంది.
Realme Narzo 20 Pro ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart మరియు Realme India స్టోర్ నుండి అమ్మకానికి ఉండనుంది.
రియల్ మీ నార్జో 20 ప్రో లో ఒక 6.5-అంగుళాల FHD + రిజల్యూషన్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేటుతో మరియు ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమేరా డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటుగా వెనుక సరికొత్త విక్టరీ డిజైన్ తో వస్తుంది.
వేగవంతమైన మీడియాటెక్ హెలియో జి 95 ప్రాసెసర్ తో నడిచే ఈ నార్జో 20 ప్రో స్మార్ట్ ఫోన్, స్టోరేజ్ అప్షన్స్ కోసం 6 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ మరియు 8 జిబి ర్యామ్ 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో జతచేయబడింది. ఈ ఫోన్ 256GB వరకు మైక్రో SD కార్డులకు మద్దతు ఇస్తుంది మరియు Realme UI లో నడుస్తుంది.
రియల్ మీ నార్జో 20 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రాధమిక 48 ఎంపి కెమెరా, 8 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్ వ్యూ మరియు 2 ఎంపి మాక్రో మరియు 2MP డెప్త్ లెన్స్ ఉన్నాయి. ముందు వైపు, 16MP SonyIMX 471 సెల్ఫీ కెమెరా పంచ్ హోల్ కటౌట్ లోపల ఉంది.
ఇక బ్యాటరీ మరిసయు ఛార్జింగ్ టెక్నలాజి విషయానికి వస్తే, ఈ నార్జో 20 ప్రో ఈ విషయంలో బెస్ట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోనులో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అత్యంత వేగవంతమైన 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంత తక్కువ ధరలో ఇటువంటి వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన ఫోనుగా Realme Narzo 20 Pro మాత్రమే జాబితాలో నిలుస్తుంది.