TECNO Spark Go Plus కేవలం రూ.6,299 ధరలో విదలయ్యింది

Updated on 10-Jan-2020
HIGHLIGHTS

ఈ ఫోనుతో Gana Plus యొక్క మూడు నెలెల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అఫర్ చేస్తోంది.

Tecno మొబైల్స్, ఇండియాలో తన TECNO Spark Go Plus స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.6,299 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ హిల్లర్ పర్పల్ మరియు వెకేషన్ బ్లూ వంటి రెండు విలక్షణమైన రంగుల ఎంపికలతో వస్తుంది. అంతేకాదు, ఇది ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తున్న గ్రేడియంట్ ఫినిషింగ్ తో పాటుగా వస్తుంది. ఇక ఈ ఫోనుతో Gana Plus యొక్క మూడు నెలెల సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అఫర్ చేస్తోంది.

TECNO Spark Go Plus : ప్రత్యేకతలు

ఈ టెక్నో స్పార్క్ గో ప్లస్ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల పరిమాణంగల HD+ డాట్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక 86.5% స్క్రీన్ టూ బాడీ రేషియో ఉంటుంది.ఈ ఫోన్ గరిష్టంగా 1.8 GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక MediaTek Helio A22 క్వాడ్ కోర్ ప్రాసెసర్ శక్తితో నడుస్తుంది. దీనికి జతగా ఒక 2GB ర్యామ్ మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజితో ఉంటుంది మరియు ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డుతో 128GB వరకూ దీని స్టోరేజిని పెంచుకునే వీలుంటుంది. ఈ ఫోన్ HiOS 5.5.2 స్కిన్ పైన Android 9.0 GoEdition ఆధారితంగా పనిచేస్తుంది. ఇందులో ఒక 4,000 mAh భారీ బ్యాటరీని AI సేవింగ్ మరియు ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా అందించింది.

ఇక కెమెరా విభానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోనులో కేవలం సింగిల్ 8MP కెమెరాని ఒక f/2.0 ఎపర్చరుతో మరియు ఒక LED  ఫ్లాష్ తో పాటుగా ఇచ్చింది. ముందు భాగంలో సెల్ఫీల కోసం, ఒక 8MP సెల్ఫీలే కెమెరాని అందించింది. ఇది డ్యూయల్ VoLTE, బ్లూటూత్ 5.0, 3-In-One నాన్-హై బ్రిడ్ సిమ్ స్లాట్ మరియు WiFi 802.11 b/g/n వంటి  ప్రత్యేకతలతో వస్తుంది.                   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :