Tecno Spark Go 5G price and features
Tecno Spark Go 5G: టెక్నో ఇండియాలో కొత్త బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అదే, టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో లైట్ వెయిట్ అండ్ ఫాస్ట్ ప్రోసెసర్ తో లాంచ్ అయ్యింది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్లో ఉన్న చాలా 5జి స్మార్ట్ ఫోన్ లకు గట్టి పోటీగా టెక్నో తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 9,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఇన్ బ్లాక్, స్కై బ్లూ మరియు టర్కోస్ గ్రీన్ మూడు రంగుల్లో లాంచ్ చేసింది. ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది.
ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను టెక్నో చాలా స్లీక్ డిజైన్ మరియు తక్కువ బరువుతో అందించింది. ఈ ఫోన్ కేవలం 7.99mm మందంతో మరియు 194 గ్రాముల బరువుతో మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ సన్నగా లైట్ వైట్ తో ఉన్నా కూడా పెద్ద 6000 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మంచి కనెక్టివిటీ కోసం నో నెట్ వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ మరింత వేగవంతమైన 5జి స్పీడ్ అందిస్తుందని టెక్నో తెలిపింది. ఎందుకంటే, ఈ ఫోన్ 4×4 MIMO సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది.
టెక్నో స్పార్క్ గో 5జి స్మార్ట్ ఫోన్ 50MP AI కెమెరా మరియు చాలా అందమైన లుక్స్ కలిగిన కొత్త కెమెరా మాడ్యూల్ తో ఉంటుంది. వీడియో కాల్స్ మరియు సెల్ఫీ ల కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి ప్రీమియం లుక్స్ తో కనిపిస్తుంది. ఈ ఫోన్ Dimensity 6400 5G చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న Panasonic Dolby Soundbar డీల్.!
ఈ ఫోన్ 6.74 ఇంచ్ HD + LCD స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ కలిగిన Ella AI ఫీచర్ తో కూడా వస్తుంది. AI కెమెరా ఫీచర్స్, సర్కిల్ టు సెర్చ్, AI రైటింగ్ అసిస్టెంట్ వంటి మరిన్ని ఫీచర్స్ కూడా టెక్నో ఈ ఫోన్ లో అందించింది.