రూ.6,999 ధరకే బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ చేసిన టెక్నో.!

HIGHLIGHTS

టెక్నో ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ ఫోన్ మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు టెక్నో పేర్కొంది

ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కేవలం రూ.6,999 ధరకే బిగ్ డిస్ప్లే  మరియు బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ ను టెక్నో లాంచ్ చేసింది. అదే Tecno Spark GO 2023 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు టెక్నో పేర్కొంది. టెక్నో విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా. 

Tecno Spark GO 2023: ధర

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ తో రూ.6,999 లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎండ్ లెస్ బ్లాక్, యూయిని బ్లూ మరియు నెబ్యులా పర్పల్ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.   

Tecno Spark GO 2023: స్పెక్స్

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90% స్క్రీన్ టూ బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ Helio A22 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ టి ఉంటుంది. 

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక AI డ్యూయల్ కెమేరా వుంది. ఇందులో 13MP ప్రైమరీ కెమేరా జతగా మరొక కెమేరా వుంది. ముందు భాగంలో, 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా HiOS సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ టైప్-C  ఛార్జింగ్ పోర్ట్ తో పెద్ద 5000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :