కొత్త స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

HIGHLIGHTS

తక్కువ ధరలో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్

మార్కెట్లోకి మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది

టెక్నో స్పార్క్ గో 2021 చాలా తక్కువ ధరకే లాంచ్

కొత్త స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే, మార్కెట్లోకి మరొక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. టెక్నో స్పార్క్ గో 2021 స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకే ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీ, పెద్ద స్క్రీన్ మరియు మంచి కెమెరాతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది.

టెక్నో స్పార్క్ గో 2021: స్పెసిఫికేషన్స్

టెక్నో స్పార్క్ గో 2021 స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 6.52 ఇంచ్ HD+ డాట్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 89.7% స్క్రీన్ టూ బాడీ రేషియో, 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు గరిష్టంగా 480 నిట్స్ బ్రైట్నెస్ అందించ గల సమర్థయంతో వుంటుంది.  ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 13MP సింగిల్ కెమెరాతో వస్తుంది. అయితే, ఈ కెమెరా HDR, నైట్ పోర్ట్ట్రైట్ వంటి 18 AI ఆటో సీన్ డిటక్షన్ తో వస్తుంది. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాని అందించారు.

టెక్నో స్పార్క్ గో 2021 స్మార్ట్ ఫోన్ లో వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ ఫిచర్స్ కూడా వున్నాయి. ఈ ఫోన్ పెద్ద 5000 mAh బ్యాటరీని కలిగివుంటుంది. ఈ ఫోన్ బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi తో వస్తుంది. ఈ ఫోన్ హారిజన్ ఆరంజ్,   మాల్దీవ్స్ బ్లూ, మరియు గెలాక్సీ బ్లూ అనే మూడు అందమైన కలర్ లలో లభిస్తుంది.  

టెక్నో స్పార్క్ గో 2021: ధర

టెక్నో స్పార్క్ గో 2021 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.7,299 రూపాయల తక్కువ ధరకే ప్రకటించింది. అయితే, లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ల క్రింద కేవలం రూ. 6,699 రూపాయలకే అఫర్ చేస్తోంది. కానీ, ఈ ధర కేవలం లిమిటెడ్ పిరియడ్ అఫర్ మాత్రమే.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :