ఇటీవల టెక్నో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన Tecno Spark 8T ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. నిన్నటి వరకు కేవలం ప్రీ-ఆర్డర్స్ కి మాత్రమే అందుబటులో వున్న ఈ ఫోన్ ఈ రోజు నుండి అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ 10 వేళా కంటే తక్కువ ధరలో పెద్ద FHD+ డిస్ప్లే మరియు 50MP డ్యూయల్ కెమెరా వంటి మరిన్ని ఫీచర్లతో ఉంటుంది.
Tecno Spark 8T స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆమెజాన్ నుండి సేల్ కి అందుబాటులో వుంది. Buy From Here
టెక్నో స్పార్క్ 8టి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 91.3 % స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.
కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 50MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ ను కూడా కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.