Tecno Spark 8T: 50MP కెమెరా మరియు భారీ ఫీచర్లతో రూ.8,999 ధరలో వచ్చింది

HIGHLIGHTS

టెక్నో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Spark 8T ను ప్రకటించింది

బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చింది

ఈ ధర పరిధిలో 50MP డ్యూయల్ కెమెరా కలిగిన ఏకైక ఫోన్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Spark 8T ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ధర బడ్జెట్ లో ఉంచినాకూడా ఫీచర్లను మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందించింది. ఈ ఫోన్ ఈ ధర పరిధిలో 50MP డ్యూయల్ కెమెరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. ఇది మాత్రమే కాదు మరిన్ని ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Tecno Spark 8T: ప్రైస్

Tecno Spark 8T స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆమెజాన్ నుండి ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో వుంది మరియు డిసెంబర్ 20 నుండి అమ్మకాలను కొనసాగిస్తుంది.  

Tecno Spark 8T: సెక్స్

టెక్నో స్పార్క్ 8టి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 91.3 % స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 50MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ ను కూడా కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :