Tecno Spark 8T : రూ.8999 ధరలో 50MP కెమెరాతో వచ్చింది..సేల్ ఎప్పుడంటే..!

HIGHLIGHTS

Tecno Spark 8T ను టెక్నో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా విడుదల చేసింది

ఈ ధర పరిధిలో 50MP డ్యూయల్ కెమెరా కలిగిన ఏకైక ఫోన్

4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్

Tecno Spark 8T ను టెక్నో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను చవక ధరలో ఉంచినా కూడా ఫీచర్లను మాత్రం భారీగానే అందించింది. అంతేకాదు, ఈ ధర పరిధిలో 50MP డ్యూయల్ కెమెరా కలిగిన ఏకైక ఫోన్ గా నిలుస్తుంది. ఇది మాత్రమే కాదు మరిన్ని ఇతర ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.

Tecno Spark 8T: ప్రైస్

Tecno Spark 8T స్మార్ట్ ఫోన్ ను 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కేవలం రూ.8,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆమెజాన్ నుండి ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో వుంది మరియు డిసెంబర్ 20 నుండి అమ్మకాలను కొనసాగిస్తుంది. 

Tecno Spark 8T: సెక్స్

టెక్నో స్పార్క్ 8టి స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 91.3 % స్క్రీన్ టూ బాడీ రేషియో మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G35 ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 4GB ర్యామ్ తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ లేటెస్ట్ HiOS 7.6 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 OS తో నడుస్తుంది.

కెమెరా పరంగా, వెనుక డ్యూయల్ కెమెరా కలిగివుంది. ఇందులో 50MP మైన్ సెన్సార్ మరియు జతగా AI సెన్సార్ ని కలిగివుంటుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 8MP సెన్సార్ సెల్ఫీ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ ను కూడా కలిగివుంది. టెక్నో ఈ ఫోన్ ను పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది.  

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :